ప్రధాన మంత్రి కార్యాలయం

భూటాన్ యొక్క రాజు గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 22 MAR 2024 6:32PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూటాన్ యొక్క రాజు గారు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యెల్ వాంగ్ చుక్ తో ఈ రోజు న థిమ్పూ లో సమావేశమయ్యారు. పారో నుండి థిమ్పూ వరకు ప్రయాణించినప్పుడు ప్రజలు ప్రధాన మంత్రి కి స్వాగతం పలికారు. ఆయన తనకు లభించిన ఈ విశిష్ట సార్వజనిక అభినందన కు గాను రాజు గారి కి ధన్యవాదాల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి మరియు భూటాన్ రాజు గారు లు భారతదేశం-భూటాన్ ల మధ్య మైత్రి సన్నిహితం గాను, అద్వితీయమైంది గాను కొనసాగుతున్నందుకు ఎక్కడ లేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహం మరియు సహకారం ల తాలూకు సన్నిహిత సంబంధాల కు రూపు రేఖల ను తీర్చిదిద్దడం లో అదే పని గా డ్రుక్ గ్యాల్ పో లు అందజేసిన మార్గదర్శకమైనటువంటి దృష్టికోణానికి గాను ప్రధాన మంత్రి తన ప్రశంస ను తెలియ జేశారు.

 

ఈ సమావేశం ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన అన్ని అంశాల ను సమీక్షించేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించింది. భూటాన్ కోసం భారతదేశం, మరి అలాగే భారతదేశం కోసం భూటాన్ అనేవి ఒక చిరకాలికమైనటువంటి వాస్తవంగా ఉందని ఇద్దరు నేత లు జ్ఞప్తి కి తెచ్చుకొంటూ, ఈ మహత్వపూర్ణమైన పరివర్తనకారి భాగస్వామ్యాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు గల మార్గాల ను గురించి చర్చించారు. వారు శక్తి, అభివృద్ధి ప్రధానమైనటువంటి సహకారం, యువత, విద్య, నవ పారిశ్రమికత్వం మరియు నైపుణ్యాల అభివృద్ధి వంటి రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకొనేందుకు చేపట్టగల కార్యక్రమాలు ఏమేమిటి అమలుచేయవచ్చో పరిశీలించారు. నేత లు ఇరువురు గెలెఫూ మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్టు సహా కనెక్టివిటీ మరియు పెట్టుబడి ప్రతిపాదనల కు సంబంధించిన పురోగతి ని గురించి కూడా చర్చించారు.

 

భారతదేశం మరియు భూటాన్ ల మధ్య మైత్రి మరియు సహకారం ల తాలూకు అద్వితీయమైన సంబంధాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇవి ఇరు పక్షాల యొక్క పరస్పర విశ్వాసాన్ని మరియు అవగాహన ను చాటిచెబుతున్నాయి.

 

***



(Release ID: 2016316) Visitor Counter : 62