ప్రధాన మంత్రి కార్యాలయం

నారీ శక్తి వందన్అధినియమ్ పై ప్రధాన మంత్రి  లోక్ సభ లో చేసినప్రసంగం పాఠం

Posted On: 21 SEP 2023 12:06PM by PIB Hyderabad

గౌరవనీయులైన అధ్యక్షా,

 

మీరు నేను మాట్లాడడానికి అనుమతి ని మరియు సమయాన్ని ఇచ్చినందుకు మీకు నేను అనేకానేక కృతజ్ఞ‌తల ను తెలియ జేస్తున్నాను.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

 

 

నేను రెండు లేదా నాలుగు నిమిషాల సమయాన్నే తీసుకోదలచాను. నిన్నటి రోజు ను భారతదేశం యొక్క పార్లమెంటరీ ప్రస్థానం లో ఒక స్వర్ణ క్షణం గా చెప్పుకోవాలి. ఈ సువర్ణ క్షణం ఏర్పడడానికి గాను సభ లోని సభ్యులు అందరు, అన్ని పక్షాల సభ్యులు, అన్ని పక్షాల నేత లు కూడా వారి వారి వంతు పాత్రల ను పోషించారు. సభ లో లేదా సభ కు వెలుపల కూడాను ఉన్న వారు కూడా ఈ గౌరవానికి అర్హులేనని అంటాను. మరి ఈ కారణం గా నేను ఈ రోజు న మీ ద్వారా ఈ మహత్వపూర్ణమైన నిర్ణయం లో దేశం లోని మాతృ శక్తి లో ఒక క్రొత్త బలాన్ని నింపడం లో, నిన్నటి ఈ నిర్ణయం మరియు ఈ రోజు న రాజ్య సభ ముగిసిన తరువాత మన చివరి మజిలీ ని కూడా పూర్తి చేసేసుకోగలుగుతాం, దేశం యొక్క మాతృశక్తి యొక్క వ్యక్తిత్వం లో ఏదైతే మార్పు సంభవిస్తుందో, ఏ రీతి లో విశ్వాసం జనిస్తుందో అది దేశాన్ని సరిక్రొత్త శిఖరాల కు తీసుకుపోయే ఒక ఊహించలేనటువంటి, సాటి ఉండనటువంటి శక్తి వలె ఉదయిస్తుంది అని నేను అనుకొంటున్నాను.

 

ఈ యొక్క పవిత్రమైన కార్యం తాలూకు భారాన్ని మోయడం కోసం మీరు అందరు కలసి అందించిన అటువంటి తోడ్పాటు కు, మీరు అందరు కలసి అందించిన అటువంటి సమర్థన కు , మీరు చేసిన అటువంటి సార్థకమైన చర్చ కు గాను, సభ నాయకుని గా నేను ఈ రోజు న మీ అందరికి మనస్పూర్తి గాను, చిత్తశుద్ధి తోను గౌరవపూర్వకమైన అభినందనల ను తెలియ జేయయడం కోసం ఇక్కడ నిలబడ్డాను; మీకు ధన్యవాదాల ను పలకడం కోసం నిల్చొనివున్నాను.

 

నమస్కారం.

 

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం. మూల ఉపన్యాసం హిందీ భాష లో ఉంది.

 

 

***



(Release ID: 2016064) Visitor Counter : 40