ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళ నాడు లోని మదురై లో జరిగన ‘క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమ లో ఎమ్ఎస్ఎమ్ఇ లకు మద్దతుఇవ్వడాని కి, వాటిని ప్రోత్సహించడానికి రూపొందించిన రెండు ప్రధాన కార్యక్రమాల ను ఆయన ప్రారంభించారు

‘‘ఆటోమోటివ్పరిశ్రమ ను ముందుకు తీసుకు పోవడం లో ఎమ్ఎస్ఎమ్ఇ  లు కీలక భాగస్వాములు గా ఉన్నాయి; దేశ ఆర్థిక వృద్ధి లో ఎమ్ఎస్ఎమ్ఇ లు కీలక పాత్ర ను పోషిస్తున్నాయి’’

‘‘ఆటోమొబైల్ పరిశ్రమ ఆర్థిక వ్యవస్థ లో ఓ పవర్ హౌస్ గా ఉంది’’

‘‘గ్లోబల్ సప్లయ్చైన్ లో ఒక ముఖ్య పాత్ర ను పోషించేందుకు గొప్ప అవకాశమొకటి ప్రస్తుతం మన ఎమ్ఎస్ఎమ్ఇలకు లభించింది’’

‘‘ఎమ్ఎస్ఎమ్ఇ ల భవిష్యత్తు లో దేశం భవిష్యత్తు ముడిపడి ఉందని భారత్ భావిస్తున్నది’’

‘‘భారత ప్రభుత్వంప్రస్తుతం ప్రతి ఒక్క పరిశ్రమ తోను భుజం భుజం కలిపి  నిలబడింది’’

‘‘వినూత్న ఆవిష్కరణల ను మరియు పోటీతత్వాన్ని ముందుకుతీసుకుపోండి.  ప్రభుత్వంపూర్తి స్థాయి లో మీకు తోడ్పడుతుంది’’

Posted On: 27 FEB 2024 7:44PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తమిళ నాడు లోని మదురై లో జరిగిన క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్కార్యక్రమం లో పాలుపంచుకొని, ఆటోమోటివ్ సెక్టర్ లో కార్యకలాపాల ను నిర్వహిస్తున్న వేల కొద్దీ సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ స్)ల యొక్క నవ పారిశ్రమిక వేత్తల ను ఉద్దేశించి ప్రసంగించారు. గాంధీగ్రామ్ లో శిక్షణ ను తీసుకొన్న మహిళా నవపారిశ్రమిక వేత్తల తోను, బడిపిల్లల తోను ప్రధాన మంత్రి మాట్లాడారు.

 

ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగిస్తూ, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణ ల రంగం లో ప్రముఖుల మధ్య కు చేరుకొన్నందుకు సంతోషం గా ఉందన్నారు. ఇది భవిష్యత్తు ను తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయోగశాల ను చూస్తున్న తరహా అనుభవాన్ని కలిగిస్తోంది అని ఆయన అన్నారు. సాంకేతిక విజ్ఞానం విషయాని కి వస్తే, ప్రత్యేకించి ఆటోమోటివ్ సెక్టర్ లో తమిళ నాడు ప్రపంచ రంగస్థలం లో ప్రావీణ్యాన్ని రుజువు చేసుకొందని ఆయన అన్నారు. కార్యక్రమాని కి క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్అనే ఇతివృత్తాన్ని ఎంచుకొన్నందుకు ఆయన హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ఎమ్ఎస్ఎమ్ఇ లు అన్నిటిని, మరి అలాగే మహత్వాకాంక్షలు పెల్లుబుకుతున్న యువత ను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చినందుకు గాను టివిఎస్ కంపెనీ కి అభినందన లు తెలియ జేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ తో పాటు, వికసిత్ భారత్ కు అవసరమైన అండదండలు లభిస్తాయన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో 7 శాతం ఆటోమొబైల్ పరిశ్రమ నుండే వస్తోంది, అంటే దేశ స్వయంప్రతిపత్తి లో ఈ పరిశ్రమ కు ఒక పెద్ద పాత్ర ఉంది అన్న మాట అని ప్రధాన మంత్రి అన్నారు. తయారీ మరియు నూతన ఆవిష్కరణ లు.. ఈ రెండిటి ని ప్రోత్సహించడం లో ఆటోమొబైల్ పరిశ్రమ యొక్క పాత్ర కు ఉన్న ప్రాముఖ్యాన్ని కూడా ఆయన గుర్తించారు.

 

భారతదేశం అభివృద్ధి పట్ల ఆటోమొబైల్ పరిశ్రమ యొక్క తోడ్పాటు స్వయం గా ఆటోమొబైల్ పరిశ్రమ లో ఎమ్ఎస్ఎమ్ఇ లు అందిస్తున్నటువంటి సేవల తో సమానమైందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ప్రతి సంవత్సరం లో 45 లక్షల కు పైగా కారు లు, 2 కోట్ల కు పైగా ద్విచక్ర వాహనాలు, 20 లక్షల సంఖ్య లో వాణిజ్య వాహనాలు, ఇంకా 8.5 లక్షల సంఖ్య లో త్రి చక్ర వాహనాలు తయారవుతున్నాయి అని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రతి ఒక్క పేసింజర్ వీకల్ లో 3000 మొదలుకొని 4000 వరకు విభిన్నమైన ఆటోమోటివ్ యంత్రభాగాల ను ఉపయోగించడం జరుగుతున్నది. మరి ఆ కోవ కు చెందిన లక్షల కొద్దీ భాగాల ను నిత్యం తయారీ ప్రక్రియ లో వినియోగించడం జరుగుతోంది అని కూడా ఆయన అన్నారు. ‘‘ఈ భాగాల తయారీ బాధ్యత ను వహిస్తున్నది భారతదేశం లోని ఎమ్ఎస్ఎమ్ఇ లు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఎమ్ఎస్ఎమ్ఇ లు చాలా వరకు భారతదేశం లోని ఒకటో అంచె నగరాల లో, మరియు రెండో అంచె నగరాల లో నెలకొన్నాయి అని ఆయన చెప్పారు. ‘‘భారతదేశం లోని ఎమ్ఎస్ఎమ్ఇ లలో తయారు అవుతున్న యంత్ర భాగాల ను ప్రపంచం లోని అనేక కారుల లో ఉపయోగించడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దీనిని బట్టి ప్రపంచవ్యాప్తం గా అనేక అవకాశాలు మన తలుపు తడుతున్నాయన్నమాటే అని ఆయన పేర్కొన్నారు.

 

‘‘ప్రస్తుతం మన ఎమ్ఎస్ఎమ్ఇ లకు గ్లోబల్ సప్లయ్ చైన్ లో ఒక ముఖ్య పాత్ర ను పోషించే ఒక ఘనమైన అవకాశం లభించింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నాణ్యత మరియు మన్నిక అనే అంశాల ను గీటురాళ్ళు గా ఎంచుకొని పని చేయవలసిన అవసరం ఉంది అని ఆయన నొక్కి చెప్పారు. నాణ్యత ను, పర్యావరణ స్థిరత్వాన్ని దృష్టి లో పెట్టుకొని జీరో డిఫెక్ట్-జీరో ఇఫెక్ట్బాట లో సాగాలన్న తన మాటల ను ఆయన మరో సారి నొక్కి చెప్పారు.

 

 

మహమ్మారి కాలం లో ఎమ్ఎస్ఎమ్ఇ లు సత్తా ను చాటాయి అని ప్రధాన మంత్రి అంగీకరించారు. ‘‘ఎమ్ఎస్ఎమ్ఇ ల యొక్క భవిష్యత్తు లో దేశం యొక్క భవిష్యత్తు ను ప్రజలు చూసుకొంటున్నారు’’ అని ఆయన అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ లకు ప్రభుత్వం అనేక విధాలు గా ప్రోత్సాహాన్ని ఇస్తున్న విషయాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ‘పిఎమ్ ముద్ర యోజన’, ‘పిఎమ్ విశ్వకర్మ యోజన’ లను గురించి మాట్లాడారు. దీనికి అదనం గా, ఎమ్ఎస్ఎమ్ఇ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ మహమ్మారి తలెత్తిన కాలం లో ఎమ్ఎస్ఎమ్ఇ రంగం లో లక్షల కొద్దీ ఉద్యోగాల ను కాపాడింది అని ఆయన అన్నారు.

 

 

ప్రస్తుతం ప్రతి రంగం లో ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం తక్కువ వడ్డీ రుణాలు మరియు వర్కింగ్ కేపిటల్ సంబంధి సదుపాయాల కు పూచీ పడడం జరుగుతున్నది; దీని ద్వారా, ఎమ్ఎస్ఎమ్ఇ ల పరిధి విస్తరిస్తున్నది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. దేశం లో చిన్న వాణిజ్య వ్యవస్థ ల ఉన్నతీకరణ అంశం లో ప్రభుత్వం శ్రద్ధ వహించడం కూడా ఒక ముఖ్యమైన కారకం వలె నిరూపణ అవుతోంది అని ఆయన అన్నారు. దేశం లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి ని ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, ‘‘క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు నైపుణ్యాలు అనేవి ఎమ్ఎస్ఎమ్ఇ ల మనుగడ కు ముఖ్యం అని ప్రభుత్వం భావించి, ఆ అంశం లో శ్రద్ధ తీసుకొంటోంది’’ అన్నారు. భవిష్యత్తు ను తీర్చిదిద్దడం లో నైపుణ్యాభివృద్ధి యొక్క పాత్ర ఎంత ముఖ్యమైందో ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది; ఇది ఏ స్థాయి లో ఉంది అంటే అధికారం లోకి వచ్చిన నాటి నుండి ఏకం గా ఒక క్రొత్త మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయడమైందన్నారు. ‘‘ఎప్పటికప్పుడు ఉన్నతీకరణ కు అవకాశం ఉండేటటువంటి పురోగామి నైపుణ్య విశ్వవిద్యాలయాలు భారతదేశం లో వెనువెంటనే నెలకొనవలసిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.

 

విద్యుత్తు వాహనాల (ఇవి స్ )కు డిమాండు పెరుగుతూ పోతోంది, ఈ ధోరణి కి అనుగుణం గా నవ పారిశ్రమిక వేత్త లు తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటూ పోవాలి అని ప్రధాన మంత్రి కోరారు. ఇటీవలె ప్రారంభించిన ‘పిఎమ్ సూర్యఘర్ యోజన’ ఇళ్ల పైకప్పుల మీద సౌర విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ ను అమర్చేందుకు తోడ్పడుతుంది. దీనితో లబ్ధిదారుల కు విద్యుత్తు ఉచితం గా లభించడమే కాకుండా, అదనపు ఆదాయం కూడా అందివస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి దశ లో ఒక కోటి కుటుంబాల ను ఈ పథకం లో చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నట్లు ప్రధాన మంత్రి వివరించారు. దీనితో పాటే ఇవి స్ కు ఇళ్ళ లో మరింత సులభం గా చార్జింగ్ స్టేశన్ లు లభిస్తాయి అని ఆయన అన్నారు.

 

మోటర్ వాహనాలు మరియు మెటర్ వాహనాల యంత్ర భాగాల తయారీ కి ఉద్దేశించిన 26,000 కోట్ల రూపాయల ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పథకాన్ని (పిఎల్ఐ స్కీము) గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. ఈ స్కీము తయారీ తో పాటు హైడ్రోజన్ వాహనాల ను ప్రోత్సహిస్తోంది అని ఆయన అన్నారు. ఈ మాధ్యం ద్వారా 100 కు పైచిలుకు పురోగామి వాహన సాంకేతికతల ను ప్రోత్సహించడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. నవ పారిశ్రమిక వేత్త లు వారి సంస్థల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలి; అంతేకాకుండా, క్రొత్త క్రొత్త రంగాల లోకి మళ్ళాలి అని ప్రధాన మంత్రి ఉద్భోదించారు. ‘‘దేశం లో నూతన సాంకేతికత లు అభివృద్ధి చెందాయా అంటే ఆయా సాంకేతికత లకు గ్లోబల్ ఇన్వెస్ట్‌ మెంట్ కూడా ఇక్కడ కు తరలి వస్తుంది’’ అని ఆయన అన్నారు.

 

 

 

అవకాశాల తో పాటే సవాళ్ళు కూడా నడచి వస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ డిజిటలైజేశన్, విద్యుదీకరణ, ప్రత్యామ్నాయ ఇంధనాల తో తిరిగే వాహనాలు మరియు బజారు అవసరాల లో హెచ్చు తగ్గు లు వంటి అంశాలు కీలకం గా మారుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ అంశాల ను అవకాశాల రూపం లోకి మార్చుకోవడాని కి సరి అయినటువంటి వ్యూహం తో పని చేయవలసిన అవసరం ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

 

 

 

ఎమ్ఎస్ఎమ్ఇ లను అధికారికం చేసే దిశ లో ఎమ్ఎస్ఎమ్ఇ ల నిర్వచనం లో సవరణ వంటి చర్యలు తీసుకోవడమైంది అని, దీనిలో ఎమ్ఎస్ఎమ్ఇ ల ఆకారం లో వృద్ధి కి మార్గం సుగమం అయిపోయింది అని ప్రధాన మంత్రి వివరించారు.

 

‘‘భారత ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి ఒక్క పరిశ్రమ తో భుజం భుజం కలిపి నిలబడింది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు, చిన్న చిన్న విషయాల కు కూడా ను వ్యక్తులు గాని లేదా సంస్థలు గాని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ లు చేయవలసి వచ్చేది, అయితే ఇప్పటి ప్రభుత్వం ఈ అంశాలన్నిటి ని పరిష్కరిస్తున్నది అని ఆయన అన్నారు. గడచిన కొన్ని సంవత్సరాల లో 40,000 కు పైగా నియమ పాలన సంబంధి అనివార్యతలకు స్వస్తి పలకడమైంది, వ్యాపారాని కి సంబంధించిన చిన్న చిన్న తప్పుల ను అపరాధాల పరిధి లో నుండి తప్పించడమైంది అని ఆయన అన్నారు.

 

‘‘అది క్రొత్త లాజిస్టిక్స్ విధానం కావచ్చు, లేదా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కావచ్చు.. ఈ చర్య లు అన్నీ కూడాను ఆటోమొబైల్ సెక్టర్ లో చిన్నతరహా పరిశ్రమల కు సహాయకారి అయ్యాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను కు రూపకల్పన చేయడం ద్వారా భారతదేశం లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి ఒక దిశ ను ప్రభుత్వం చూపెట్టింది అని ఆయన వివరించారు. ఈ విధానం లో భాగం గా సమాచారాన్ని 1500 అంచెల లో ప్రాసెస్ చేయడం ద్వారా మల్టి-మాడల్ కనెక్టివిటీ కి అపారమైన శక్తి ని ప్రసాదించి, రాబోయే కాలానికి తగ్గట్టు గా మౌలిక సదుపాయాలు ఏ విధం గా ఉండాలో ఆ విధమైనటువంటి వ్యవస్థ ను ఏర్పరచడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క పరిశ్రమ కోసం దన్ను గా నిలచే వ్యవస్థ లను రూపొందించడం జరుగుతున్నది అని కూడా ఆయన తెలిపారు. ఈ సమర్థన వ్యవస్థ తాలూకు ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవలసిందంటూ ఆటోమొబైల్ రంగ ఎమ్ఎస్ఎమ్ఇ స్టేక్ హోల్డర్ స్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన ఆవిష్కరణల ను, పోటీతత్వాన్ని పెంచుతూ ముందుకు పోండి, మీ వెన్నంటి ప్రభుత్వం నిలబడుతుంది. టివిఎస్ యొక్క తాజా ప్రయాస ఈ దిశ లో మీకు సాయపడుతుందన్న నమ్మకం నాలో ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రభుత్వం యొక్క స్క్రాపింగ్ పాలిసీ ని గురించి కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. పాత వాహనాలు అన్నిటి ని సరిక్రొత్త వాహనాల తో బదలాయించాలి అనేటటువంటి అభిలాష ను ఆయన వ్యక్తం చేశారు. ఈ రంగం తో సంబంధం ఉన్న వర్గాలు ఈ పరిణామం తాలూకు గరిష్ఠ ప్రయోజనాన్ని పొందవచ్చును అని ఆయన సూచించారు. నౌక ల తయారీ లో క్రొత్త క్రొత్త పద్ధతుల ను ఆవిష్కరించాలని, నౌకల లోని భాగాల రీసైకిలింగ్ కు బజారు ను సృష్టించాలని ఆయన అన్నారు. డ్రైవర్ లు ఎదుర్కొంటున్న సవాళ్ళ ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, హైవే పై వాహనాల ను నడిపే డ్రైవర్ ల కోసం ఒక వేయి కేంద్రాల ను నెలకొల్పాలన్నారు. ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, సభికుల కు శుభాకాంక్ష లను తెలియ జేశారు; దేశాన్ని నూతన శిఖరాల కు తీసుకుపోయే విషయం లో సభికుల యొక్క ప్రణాళికల లో వారి కి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.

 

ఈ కార్యక్రమం లో సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, టివిఎస్ సప్లయ్ చైన్ సాల్యూశన్స్ లిమిటెడ్ చైర్‌మన్ శ్రీ ఆర్. దినేశ్ మరియు ఇతరులు పాలుపంచుకొన్నారు.

 

 

పూర్వరంగం

 

మదురై లో జరిగిన క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, ఆటోమోటివ్ సెక్టర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ )లకు చెందిన వేల కొద్దీ నవ పారిశ్రమిక వేత్తల ను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం లో ఆటోమోటివ్ పరిశ్రమ లో భాగం గా ఉన్న ఎమ్ఎస్ఎమ్ఇ లకు సమర్థన ను అందించడం కోసం రూపొందించినటువంటి రెండు ప్రధానమైన కార్యక్రమాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల లో టివిఎస్ ఓపన్ మొబిలిటీ ప్లాట్ ఫార్మ్ , ఇంకా టివిఎస్ మొబిలిటీ-సిసిఐ సెంటర్ ఆఫ్ ఇక్సె లన్స్ కలసి ఉన్నాయి. ఈ కార్యక్రమాలు దేశం లో ఎమ్ఎస్ఎమ్ఇ ల అభివృద్ధి కి సమర్థన ను ఇవ్వాలన్న, వాటి నిర్వహణ ను నిర్దిష్టపరచాలన్న, గ్లోబల్ వేల్యూ చైన్ లతో వాటిని జతపరచాలన్న మరియు ఎమ్ఎస్ఎమ్ఇ లు స్వయం సమృద్ధం కావడం లో సాయ పడాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాన్ని సాకారం చేసే దిశ లో ఒక భాగం గా ఉన్నాయి.

 

 



(Release ID: 2015973) Visitor Counter : 54