ప్రధాన మంత్రి కార్యాలయం
2024 తాత్కాలిక బడ్జెటు ను గురించి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
01 FEB 2024 1:52PM by PIB Hyderabad
ప్రియమైన నా దేశ ప్రజలారా,
ఈ రోజు న ప్రవేశ పెట్టిన బడ్జెటు అవడాని కి ఒక తాత్కాలిక బడ్జెటు యే అయినప్పటికి ఇది అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి మరియు వినూత్నం అయినటువంటి బడ్జెటు గా ఉంది. ఈ బడ్జెటు నిరంతరత తాలూకు విశ్వాసాన్ని తన వెంట తీసుకు వచ్చింది. ఈ బడ్జెటు ‘వికసిత్ భారత్’ యొక్క నాలుగు స్తంభాలు అయినటువంటి యువతీయువకులు, పేదలు, మహిళలు మరియు రైతులకు సాధికారిత ను కల్పించనుంది. నిర్మల గారు ప్రతిపాదించిన ఈ బడ్జెటు దేశం యొక్క భవిష్యత్తు ను నిర్మించేటందుకు ఉద్దేశించిన బడ్జెటు అని చెప్పాలి. ఈ బడ్జెటు 2047వ సంవత్సరానికల్లా ‘వికసిత్ భారత్’ యొక్క పునాదిని బలపరచేటటువంటి హామీని మోసుకు వచ్చింది. నిర్మల గారి ని మరియు ఆమె యొక్క జట్టు సభ్యుల ను నేను మనస్ఫూర్తి గా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశం లో యువతీ యువకుల ఆకాంక్షల కు ఈ బడ్జెటు అద్దం పడుతోంది. రెండు ముఖ్యమైన నిర్ణయాలను ఈ బడ్జెటులో తీసుకోవడమైంది. పరిశోధనలకు మరియు నూతన ఆవిష్కరణలకు ఒక లక్ష కోట్ల రూపాయల నిధి ని ప్రకటించడమైంది. స్టార్ట్-అప్స్ కు దొరుకుతున్న పన్ను మినహాయింపును విస్తరించాలనే ఒక ప్రకటన ను కూడా బడ్జెటు లో పొందుపరచడమైంది.
మిత్రులారా,
ఈ బడ్జెటు లో ద్రవ్యలోటు ను అదుపు లో పెడుతూనే, మూలధన వ్యయం కోసం 11 లక్షల 11 వేల 111 కోట్ల రూపాయల ను కేటాయించడమైంది. ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం చరిత్ర లో ఇంతవరకు లేదు. ఆర్థికవేత్తల మాటలలో చెప్పాలి అంటే ఇది ఒకరకమైన ఆశాకిరణం వంటిది. ఇది భారతదేశం లో 21 వ శతాబ్ది కి అధునాతన మౌలిక సదుపాయాల ను నిర్మించడాని కి దారితీయడం ఒక్కటే కాకుండా యువత కోసం ఉపాధి తాలూకు అసంఖ్యాకమైనటువంటి నూతన అవకాశాల ను కూడా అందించనుంది. ‘వందే భారత్ స్టాండర్డ్’ లో 40,000 ఆధునిక రైలు పెట్టెలను తయారు చేయాలని, వాటిని ప్రయాణికుల రైళ్ళ కు జత చేయాలన్న ప్రకటన బడ్జెటు లో ఉంది. దీనితో దేశం లో వేరు వేరు రైలు మార్గాల లో ప్రయాణించే లక్షల కొద్దీ ప్రయాణికుల కు యాత్రానుభూతి ని ఇప్పటి కంటే కూడాను పెంచుతుంది.
మిత్రులారా,
మనం ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని, దానిని సాధించాం; మరి అటు తరువాత మన కోసం మరింత పెద్దదైన లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకొన్నాం. పేదల కోసం గ్రామాల లో, నగరాల లో నాలుగు కోట్ల కు పైగా ఇళ్ళను మేం నిర్మించాం. ప్రస్తుతం రెండు కోట్ల క్రొత్త గృహాల ను అదనం గా నిర్మించాలి అని ఒక లక్ష్యాన్ని మేం పెట్టుకొన్నాం. రెండు కోట్ల మంది ‘లక్షాధికారి సోదరీమణుల’ ను తీర్చిదిద్దాలి అన్నది మా ఆరంభిక లక్ష్యం. ప్రస్తుతం, ఈ లక్ష్యాన్ని మూడు కోట్ల మంది ‘లక్షాధికారి సోదరీమణుల’కు పెంచడమైంది. ఆయుష్మాన్ భారత్ పథకం పేద ప్రజలకు ఎంతగానో సాయ పడింది. ప్రస్తుతం, ‘ఆంగన్ బాడీ’ కార్యకర్తలు, ఇంకా ‘ఆశా’ కార్యకర్తలు కూడా ఈ పథకం నుండి అందే ప్రయోజనాల ను అందుకోబోతున్నారు.
మిత్రులారా,
పేద ప్రజల కు, మధ్య తరగతి వర్గాని కి సాధికారిత ను కల్పించడం, వారి కోసం క్రొత్త ఆదాయ అవకాశాల ను ఏర్పరచడం గురించి ఈ బడ్జెటు లో శ్రద్ధ తీసుకోవడమైంది. ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్తు ఉత్పత్తి సంబంధి ప్రచార కార్యక్రమం లో భాగం గా ఒక కోటి కుటుంబాలు ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసే సౌర ఫలకాల ద్వారా విద్యుత్తు ను ఉచితం గా అందుకోనున్నాయి. ఇది ఒక్కటే కాకుండా, ప్రజలు మిగులు విద్యుత్తు ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ప్రతి ఏటా 15 వేల రూపాయల నుండి 20 వేల రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఈ ఆదాయం ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటు లోకి వస్తుంది.
మిత్రులారా,
ఆదాయపు పన్ను తగ్గింపు పథకాన్ని గురించి ఈ రోజున వెలువడ్డ ప్రకటన సుమారు గా ఒక కోటి మంది మధ్య తరగతి వ్యక్తుల కు చెప్పుకోదగ్గ ఉపశమనాన్ని అందిస్తుంది. మునుపటి ప్రభుత్వాలు సామాన్య మానవుల తలకాయల మీద ఒక పెద్ద కత్తి ని దశాబ్దాల తరబడి వేలాడగట్టి, భారాన్ని మోపాయి. ఈ రోజు న ఈ బడ్జెటు లో రైతుల కోసం కీలకమైనటువంటి మరియు ప్రముఖమైనటువంటి నిర్ణయాల ను కూడా తీసుకోవడమైంది. అది నేనో డిఎపి యొక్క వినియోగం కావచ్చు, పశు సంపద కు ఉద్దేశించిన ఒక క్రొత్త పథకం కావచ్చు, పిఎ మత్స్య సంపద యోజన యొక్క విస్తరణ కావచ్చు లేదా ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ కావచ్చు.. వీటితో రైతు ల యొక్క ఆదాయం వృద్ధి చెందనుంది. మరి ఖర్చుల లోనూ చెప్పుకోదగిన తగ్గింపు నమోదు కానుంది. మరొక్క సారి పౌరులు అందరికీ ఈ చరిత్రాత్మకమైనటువంటి బడ్జెటు కు గాను నేను శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. మీకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు.
***
(Release ID: 2015531)
Visitor Counter : 100
Read this release in:
Kannada
,
Bengali
,
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil