ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మొట్టమొదటి నేశనల్ క్రియేటర్స్ అవార్డు ను మార్చి నెల8 వ తేదీ నప్రదానం చేయనున్న ప్రధాన మంత్రి


కథ చెప్పడం, సామాజిక మార్పు ను సమర్థించడం, పర్యావరణ పరమైన స్థిరత్వాన్ని ప్రచారం చేయడం, విద్య, గేమింగ్ సహా ఇతర రంగాల లో ఉత్కృష్టత ను మరియు ప్రభావాన్ని గుర్తించే ఓప్రయాస యే ఈ పురస్కారం

ఈ పురస్కారాని కి ప్రజల నుండి ఎక్కడ లేని భాగస్వామ్యంవ్యక్తం అయింది;  1.5 లక్షల కంటే ఎక్కువ నామినేశన్ లు వచ్చాయి, సుమారు గా 10 లక్షల వోట్లు వేయడమైంది

ఇరవై కేటగిరీల లో ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది

Posted On: 07 MAR 2024 4:28PM by PIB Hyderabad

ఒకటో నేశనల్ క్రియేటర్స్ అవార్డు ను 2024 మార్చి నెల 8 వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల వేళ లో న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

 

కథ చెప్పడం, సామాజిక మార్పు ను సమర్థించడం, పర్యావరణ పరమైన స్థిరత్వాన్ని గురించి ప్రచారం చేయడం, విద్య, గేమింగ్ లు సహా ఇతర రంగాల లో ఉత్కృష్టత ను మరియు ప్రభావాన్ని గుర్తించే ఒ ప్రక్రియ యే ఈ పురస్కారం. సకారాత్మకమైన పరివర్తన ను తీసుకు రావడం కోసం సృజనశీలత్వాన్ని ఉపయోగించుకొనేందుకు ఒక వేదిక గా ఈ అవార్డు ను ప్రతిపాదించడమైంది.

 

 

జాతీయ సృజనశీలి పురస్కారానికి గాను అనుకరణీయమైన సార్వజనిక భాగస్వామ్యం వ్యక్తం అయింది. మొదటి విడత లో 20 విభిన్న శ్రేణులలో 1.5 లక్షల కంటే ఎక్కువ నామినేశన్ లు అందాయి. దీని తరువాత, వోటింగ్ విడత లో విభిన్న పురస్కార శ్రేణులలో డిజిటల్ సృజనశీలుర కోసం సుమారు పది లక్షల వోట్లు పడ్డాయి. దీని తరువాత, మూడు ఇంటర్ నేశనల్ క్రియేటర్స్ సహా 23 మంది విజేతల ను నిర్ణయించడమైంది; పురస్కారం నిజం గా ప్రజల అభీష్టాని కి అద్దం పడుతోంది అనడాని కి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడం ఒక ప్రపమాణం గా ఉంది.

 

 

ఈ పురస్కారాలను సర్వశ్రేష్ట కథకుల పురస్కారం సహా ఇరవై కేటగిరీల లో అందజేయడం జరుతుంది; ఆయా కేటగిరీల లో డిస్‌రప్టర్ ఆఫ్ ది ఇయర్; సెలబ్రిటీ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్; గ్రీన్ చాంపియన్ అవార్డు; బెస్ట్ క్రియేటర్ ఫార్ సోశల్ చేంజ్; మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ ఎగ్రి క్రియేటర్; కల్చరల్ ఎంబేసడర్ ఆఫ్ ద ఇయర్; ఇంటర్ నేశనల్ క్రియేటర్ అవార్డ్; బెస్ట్ ట్రేవల్ క్రియేటర్ అవార్డ్; స్వచ్ఛతా ఎంబేసడర్ అవార్డ్; న్యూ ఇండియా చేంపియన్ అవార్డ్; టెక్ క్రియేటర్ అవార్డ్; హెరిటేజ్ ఫేశన్ ఐకాన్ అవార్డ్; మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ (పురుషుడు & మహిళ ); బెస్ట్ క్రియేటర్ ఇన్ ఫూడ్ కేటగిరీ; బెస్ట్ క్రియేటర్ ఇన్ ఎడ్యుకేశన్ కేటగిరీ; బెస్ట్ క్రియటర్ ఇన్ గేమింగ్ కేటగిరీ; బెస్ట్ మైక్రో క్రియేటర్; బెస్ట్ నేనో క్రియేటర్; బెస్ట్ హెల్థ్ ఎండ్ ఫిట్‌నెస్ క్రియేటర్ లు భాగం గా ఉన్నాయి.

 

***

 


(Release ID: 2015528) Visitor Counter : 86