ప్రధాన మంత్రి కార్యాలయం

భూటాన్ యొక్క ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి


2024 ఫిబ్రవరి లో పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన అనంతరం తొలి విదేశీ యాత్ర లో భాగంగా భారతదేశాని కి విచ్చేసిన ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గే కు స్వాగతం పలికినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఇద్దరు నేతలు వారి విశిష్టమైన మరియు అద్వితీయమైన ద్వైపాక్షికమైత్రిని మరింత బలపరచాలంటూ వారి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు

భూటాన్ యొక్క అభివృద్ధి ప్రక్రియ లో భారతదేశం ఒకవిశ్వసనీయమైన, మహత్వపూర్ణమైన మరియు ప్రధానమైన భాగస్వామి గా ఉంది అని పేర్కొన్నప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గే

వచ్చే వారం లో భూటాన్ కు రావలసిందంటూ అందినఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 

Posted On: 15 MAR 2024 10:22AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూటాన్ యొక్క ప్రధాని శ్రీ దాశో శెరింగ్ తోబ్‌గే తో న్యూ ఢిల్లీ లో నిన్నటి రోజు న సమావేశమయ్యారు.

 

 

 

ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గే భారతదేశం లో ఆధికారిక పర్యటన కు విచ్చేశారు. ఇది 2024 వ సంవత్సరం ఫిబ్రవరి నెల లో ఆయన పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత చేపట్టిన మొట్టమొదటి విదేశీ యాత్ర.

ఇద్దరు నేత లు మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ, శక్తి, జలవిద్యుత్తు సంబంధి సహకారం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు మరియు అభివృద్ధి ప్రధానమైనటువంటి సహకారం సహా ద్వైపాక్షిక భాగస్వామ్యం కొనసాగుతున్న అనేక రంగాల లో పురోగతి ని సమీక్షించారు. వారు విశిష్టమైనటువంటి మరియు అద్వితీయమైనటువంటి భారతదేశం-భూటాన్ మైత్రి ని మరింత గా బలపరచాలి అన్న వారి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.

 

భూటాన్ యొక్క అభివృద్ధి ప్రధాన ప్రాథమ్యాల లో భారతదేశం ఒక విశ్వసనీయమైనటువంటి, మహత్వపూర్ణమైనటువంటి మరియు బరోసాను ఇచ్చేటటువంటి భాగస్వామి గా తన పాత్ర ను పోషిస్తోంది అంటూ భూటాన్ యొక్క ప్రధాని తన ప్రశంస ను వ్యక్తం చేశారు.

 

భూటాన్ రాజు పక్షాన ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గే వచ్చే వారం లో భూటాన్ సందర్శన కు తరలి రండి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి స్వీకరించారు.

 

***

 



(Release ID: 2014891) Visitor Counter : 107