ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కల్ పక్కమ్ ఆరంభాన్ని పరిశీలించిన ప్రధాన మంత్రి

Posted On: 04 MAR 2024 11:45PM by PIB Hyderabad

భారతదేశం లో మొట్ట మొదటిది అయినటువంటి మరియు పూర్తి గా దేశీయం గా నిర్మాణం జరిగినటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క ‘‘కోర్ లోడింగ్’’ ప్రక్రియ కల్‌పక్కమ్ లో ఆరంభం అయిన ఘట్టాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పరిశీలించారు.

ఈ బ్రీడర్ రియాక్టర్ వినియోగించుకొనే ఇంధనం కంటే అధికంగా ఉత్పాదన ను అందిస్తుంది అని, భారతదేశం లో అపారం గా ఉన్న థోరియమ్ నిక్షేపాలు పూర్తి గా సద్వినియోగం అయ్యేందుకు మార్గాన్ని ఇది సుగమం చేస్తుంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ఈ రోజు న, భారతదేశం యొక్క మొట్ట మొదటిది మరియు పూర్తి గా దేశీయం గా రూపొందినదీ అయినటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తాలూకు ‘కోర్ లోడింగ్’ ప్రక్రియ కల్‌పక్కమ్ లోమొదలవడాన్ని నేను గమనించాను. ఈ బ్రీడర్ రియాక్టర్ వినియోగించుకొనే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్నే ఉత్పత్తి చేస్తుంది.

ఈ బ్రీడర్ రియాక్టర్ ద్వారా భారతదేశం లోని అపారమైన థోరియమ్ నిక్షేపాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకొనేందుకు మార్గం సుగమం కాగలదు; మరి ఈ విధం గా పరమాణు ఇంధనాన్ని దిగుమతి చేసుకొనే అగత్యం సమాప్తం అవుతుంది.

దీనితో భారతదేశానికి శక్తి రంగం లో స్వయం సమృద్ధి ని సాధించడం తో పాటు నెట్ జీరో లక్ష్యాన్ని సాధించే దిశ లో ముందడుగు వేయడం లో సాయం అందుతుంది.’’ అని పేర్కొన్నారు.


(Release ID: 2011694)