మంత్రిమండలి
సమగ్ర వ్యాధి నియంత్రణ, మహమ్మారి సంసిద్ధత కోసం నేషనల్ వన్‌హెల్త్ మిషన్‌కు నాయకత్వం వహించేందుకు శాస్త్రవేత్త హెచ్ (వేతన స్థాయి-15) స్థాయిలో నాగ్‌పూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ డైరెక్టర్ పదవిని సృష్టించేందుఉ ఆమోదం తెలిపిన క్యాబినెట్
Posted On:
29 FEB 2024 3:40PM by PIB Hyderabad
మానవుల, జంతువుల, వృక్షజాల, పర్యావరణ రంగాలన్నింటికీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సమగ్ర వ్యాధి నియంత్రణ, మహమ్మారులను ఎదుర్కొనేందుకు సంసిద్ధత కోసం బహుళ మంత్రిత్వ శాఖ, బహుళ రంగ జాతీయ వన్ హెల్త్ మిషన్‌కు మిషన్ డైరెక్టర్‌గా పని చేయడంతో పాటుగా వన్ హెల్త్ జాతీయ సంస్థ, నాగ్‌పూర్ డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు శాస్త్రవేత్త హెచ్ (15 వేతన స్థాయిలో) సమానమైన ఒక పదవిని సృష్టించాలన్న ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
ఆర్ధిక ప్రభావాలుః
వన్ హెల్త్ జాతీయ సంస్థ డైరెక్టర్‌గా వేతన స్థాయి 15 (రూ.1,82,000 - రూ. 2,24,100) గల శాస్త్రవేత్త హెచ్ స్థాయి పదవిని సృష్టించడం వల్ల వార్షిక ఆర్ధిక ప్రభావం దాదాపు రూ. 35.59 లక్షలుగా ఉండనుంది.
వ్యూహాల అమలు & లక్ష్యాలుః
మానవులు, జంతు, వృక్షజాలం, పర్యావరణ రంగాలను ఏకీకృతం చేయడం ద్వారా సమీకృత వ్యాధి నియంత్రణ, మహమ్మారి సంసిద్ధత కోసం బహుళ మంత్రిత్వ శాఖలు, బహుళ రంగాల నేషనల్ వన్ హెల్త్ మిషన్ తాలూకు మిషన్ డైరెక్టర్‌తో పాటుగా నాగపూర్ వన్‌హెల్త్ జాతీయ సంస్థ డైరెక్టర్ సేవలందిస్తారు. సమీకృత వ్యాధులు, సమగ్ర వ్యాధుల కేంద్ర, మహమ్మారి సంసిద్ధత కోసం పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసే వన్‌హెల్త్ జాతీయ ఆరోగ్యమిషన్ కోసం కార్యక్రమాన్ని 01.01.2024నే ఆమోదించారు.
ఉపాధి కల్పన సామర్ధ్యం సహా ప్రధాన ప్రభావంః
వన్ హెల్త్ విధానాన్ని వ్యవస్థీకరించడం ద్వారా సమగ్ర వ్యాధి నియంత్రణ, మహమ్మారి సంసిద్ధతను సాధించేందుకు జాతీయ వన్ హెల్త్ మిషన్ భారత్ తోడ్పాటునిస్తుంది. ఇది మానవులు, జంతువులు, వృక్షజాల, పర్యావరణ ఆరోగ్యాన్ని సమగ్రంగా, స్థిరమైన పద్ధతిలో పరిష్కరించేందుకు సహకారాన్ని పెంపొందించడం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలలో కొనసాగుతున్న/ కార్యక్రమాలను కూడా ఉపయోగించుకొని, ప్రభావితం చేస్తుంది.
నేపథ్యంః
గత కొన్ని దశాబ్దాలలో నిపాహ్, హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లూయెన్జా, సార్స్- సిఒవి-2 సహా పలు సాంక్రమిక వ్యాధులు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనతో కూడిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులకు దారి తీసింది. ఇందుకు అదనంగా, పశువులలో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (గాళ్లు), లంపీ స్కిన్ డిసీజ్, పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటివన్నీ కూడా రైతాంగ ఆర్థిక సంక్షేమాన్ని, దేశ ఆరోగ్య భద్రతను ప్రభావితం చేస్తాయి. ఈ వ్యాధులు వన్యప్రాణులను ప్రభావితం చేసి, వాటి పరిరక్షణకు ముప్పును కలిగిస్తాయి.
మానవులు, జంతువులు, మొక్కలు సహా సహజీవనం చేసే పర్యావరణానికి సవాళ్ళతో కూడిన ముప్పు తాలుకు సంక్లిష్టత, పరస్పర అనుసంధానత కారణంగా అందరికీ ఆరోగ్యం & సంక్షేమం అన్న లక్ష్యాన్ని సాధించేందుకు సమగ్ర, ఏకీకృత వన్ హెల్త్ ఆధారిత విధానం అవసరం అవుతుంది. దీనిని పరిగణనలోకి తీసకుంటే, 13 ప్రభుత్వ శాఖల సహకారంతో నేషనల్ వన్ హెల్త్ మిషన్ రూపంలో సమీకృత చట్రాన్ని రూపొందించారు. ఇది ఈ రంగాల వ్యాప్తంగా మహమ్మారులను/ అటువ్యాధులను ముందస్తుగానే గుర్తించేందుకు సమగ్ర, సమీకృత ఆర్ &డితో పాటు వన్ హెల్త్ విధానాన్ని అనుసరిస్తూ, టీకాలు, చికిత్సలు, రోగనిర్ధారణలు, మోనోక్లోనల్స్ & ఇతర జెనోమిక్ (విశ్వ జన్యురాశి) పరికరాలు తదితర వైద్య సంబంధిత ప్రతి లక్ష్యిత ఆర్ &డిని వేగవంతం ప్రాధన్య కార్యకలాపాలకు యోగవాహకంగా ఉండి సమన్వయం చేస్తుందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేస్తుంది.
****
(Release ID: 2010499)
Visitor Counter : 136
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam