ప్రధాన మంత్రి కార్యాలయం

‘మేరా పహ్ లా వోట్ దేశ్ కే లియే’ ప్రచారాన్ని గురించి న సందేశాన్ని మొదటిసారి గా వోటు వేయబోతున్న వారి లో వ్యాప్తి చేయాలని అన్ని వర్గాల వారిని కోరిన ప్రధాన మంత్రి

Posted On: 27 FEB 2024 1:25PM by PIB Hyderabad

‘మేరా పహ్ లా వోట్ దేశ్ కే లియే’ ప్రచార ఉద్యమ సందేశాన్ని మొట్టమొదటి సారిగా వోటు ను వేయబోతున్న వారి చెంతకు తీసుకుపోవలసిందని అన్ని వర్గాల ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

 

మొట్టమొదటి సారిగా వోటు వేయనున్న వారి లో చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తో పాటు, యువ వోటరు లు వారి ప్రజాస్వామిక హక్కు ను వినియోగించుకొనేటట్లు గా ప్రోత్సహించడాని కి గాను ‘మేరా పహ్ లా వోట్ దేశ్ కే లియే’ అనే అంశం తో కూడిన ప్రచార ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతున్నది.

 

కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకుర్ ఎక్స్ హేండిల్ లో ‘మేరా పహలా వోట్ దేశ్ కే లియే’ గీతాన్ని శేర్ చేస్తూ, దానిని శేర్ చేయవలసింది గా అందరిని కోరారు.

 

కేంద్ర మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సందేశాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘రండి, మనం మన ఎన్నికల ప్రక్రియ ను మరింత ఎక్కువ భాగస్వామ్య ప్రధానమైంది గా తీర్చిదిద్దుదాం. ఈ సందేశాన్ని మొట్టమొదటి సారి గా వోటు వేయనున్న వారి చెంతకు అన్ని రంగాల వారు వారివైనటువంటి శైలుల లో చేర్చవలసిందంటూ నేను పిలుపునిస్తున్నాను -#MeraPehlaVoteDeshKeLiye’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST



(Release ID: 2009497) Visitor Counter : 92