ప్రధాన మంత్రి కార్యాలయం
గిరిజనుల అతి పెద్ద పండుగ సమ్మక్క-సారక్క మేడారం జాతరఆరంభం అయిన సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
21 FEB 2024 10:30AM by PIB Hyderabad
ఆదివాసుల అతి పెద్ద పండుగల లో ఒకటైనటువంటి సమ్మక్క-సారక్క మేడారం జాతర ఆరంభం అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. సమ్మక్క కు మరియు సారక్క కు శ్రీ నరేంద్ర మోదీ నివాళుల ను అర్పించారు. ఏకత్వ భావన మరియు పరాక్రమ భావన మూర్తీభవించిన ఆ ఇరువురి ని ఆయన స్మరించుకొన్నారు కూడా.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
“గిరిజనులు జరుపుకొనే అతి పెద్ద పండుగల లో ఒకటైనటువంటి, మన సాంస్కృతిక వారసత్వాని కి చిరకాలిక స్ఫూర్తి గా నిలచేటటువంటి మరియు చైతన్య శక్తి కి అద్దం పట్టే టటువంటి సమ్మక్క- సారక్క మేడారం జాతర ఆరంభం అయిన సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం మరియు సాముదాయిక భావన ల యొక్క మహా సమ్మేళనం అని చెప్పాలి. సమ్మక్క- సారక్కల కు ప్రణామాల ను ఆచరించుదాం; ఏకత్వానికి మరియు పరాక్రమానికి ప్రతీకలు గా నిలచినటువంటి సమ్మక్క, సారక్క లను మనం ఈ సందర్భం లో మరోమారు గుర్తు తెచ్చుకొందాం.” అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 2007588)
Visitor Counter : 215
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam