మంత్రిమండలి

ఫిశరీస్ ఎండ్ ఆక్వాకల్చర్ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడిఎఫ్) యొక్క పొడిగింపున కు ఆమోదంతెలిపిన మంత్రి మండలి

Posted On: 08 FEB 2024 9:04PM by PIB Hyderabad

ఇప్పటికే సమ్మతించిన 7522.48 కోట్ల రూపాయల నిధి మరియు 939.48 కోట్ల రూపాయల బడ్జెటు పరమైన సమర్థన లతో ఫిశరీస్ ఎండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడిఎఫ్) ను 2025-26 వరకు మరొక మూడు సంవత్సరాల పాటు పొడిగించడానికి మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదాన్ని తెలియజేసింది.

 

 

చేపల పెంపకం రంగాని కి ఆధారమైనటువంటి మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం 2018-19 లో 7522.48 కోట్ల రూపాయల మొత్తం ధన రాశి తో ఫిశరీస్ ఎండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడిఎఫ్) ను ఏర్పాటు చేసింది. 2018-19 మొదలుకొని, 2022-23 మధ్య కాలం లో ఎఫ్ఐడిఎఫ్ అమలు తాలూకు తొలి దశ లో చేపల పెంపకం సంబంధి మొత్తం 121 వివిధ పథకాల మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం 5588.63 కోట్ల రూపాయల ఖర్చు ను ఆమోదించడం జరిగింది. ఎఫ్ఐడిఎఫ్ వర్తింపు ను విస్తరించినందువల్ల ఫిశింగ్ హార్బర్ లు, ఫిశ్ లాండింగ్ సెంటర్ లు, ఐస్ ప్లాంటు లు, చలవ గిడ్డంగులు, చేపల రవాణా సంబంధి సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, ఆధునిక చేపల బజారులు, బ్రూడ్ బ్యాంకులు, చేపల ను పెంచే చెరువులు, చేపలు మరియు రొయ్యల పెంపకం, ఫిశ్ సీడ్ ఫార్మ్ స్, చేపల పెంపకానికి సంబంధించినటువంటి అత్యాధునిక శిక్షణ కేంద్రాలు, ఫిశ్ ప్రోసెసింగ్ యూనిట్ లు, చేపల కు అవసరమైన దాణా ను తయారు చేసే మిల్లు లు/ప్లాంటు లు, జలాశయాల లో పంజరాల వంటి నిర్మాణాల ను ఏర్పరచి వాటి లో చేపల ను పెంచడం, సముద్ర అంతర్భాగం లో చేపల ను పట్టడం కోసం ఉద్దేశించిన నౌకల ను ప్రవేశపెట్టడం, రోగ నిదాన ప్రయోగశాల లు, మేరికల్చర్ ఎండ్ ఆక్వాటిక్ క్వారంటీన్ సదుపాయాలు వంటి వివిధ సౌకర్యాల ను అభివృద్ధి పరచడం ముమ్మరం కానుంది.

 

 

 

నోడల్ లోనింగ్ ఎన్ టిటీస్ (ఎన్ఎల్ఇ స్) అంటే వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి విషయాల జాతీయ బ్యాంకు (ఎన్ఎబిఎఆర్‌డి), జాతీయ సహకార సంఘాల అభివృద్ధి సంస్థ (ఎన్‌సిడిసి), ఇంకా అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల మాధ్యం ద్వారా గుర్తించిన ఫిశరీస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంబంధి సదుపాయాల ను అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సహా అర్హత కలిగిన ఎన్ టిటీ స్ (ఇఇ స్) కు తగ్గింపు రేటుల కు ఆర్థిక సహాయాన్ని అందజేయడాన్ని ఎఫ్ఐడిఎఫ్ కొనసాగించనుంది; ప్రభుత్వం ఈ తరహా సంస్థల లో కూడా భాగం పంచుకొంటాయి. ప్రభుత్వం ఎఫ్ఐడిఎఫ్ నోడల్ లోనింగ్ ఎన్‌టిటీస్ (ఎన్ఎల్ఇ స్) ద్వారా తక్కవ లో తక్కువ 5 శాతం వార్షిక వడ్డీ రేటు తో రాయితీసహిత ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం 12 సంవత్సరాల తిరిగి చెల్లింపు కాలావధి కి గాను రెండు సంవత్సరాల రుణ విరామం తో ఒక్కో సంవత్సరానికి 3 శాతం వడ్డీ తగ్గింపు ను అనుగ్రహిస్తుంది.

 

 

ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ మరియు పాడి విభాగానికి ఆధారమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కి గాను అందించిన నిధి తో నవ పారిశ్రామికవేత్తల కు, వ్యక్తిగత రైతుల కు, సహకార సంఘాల కు వాటి ప్రాజెక్టుల నిమిత్తం పరపతి పూచీ సౌకర్యాన్ని కూడాను సమకూర్చుతుంది.

 

 

ఎఫ్ఐడిఎఫ్ లో భాగం గా అర్హమైన సంస్థల లో రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ యాజమాన్యం లోని కార్పొరేశన్ లు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు, ప్రభుత్వ సమర్థన ను కలిగి ఉన్న సంస్థలు, చేపల పెంపకం సంబంధి సహకార సమాఖ్యలు , సహకార సంఘాలు, చేపల ను పెంచేటటువంటి రైతులు & చేపల సంబంధి ఉత్పాదనల సంబంధి కార్యకలాపాల లో నిమగ్నం అయినటువంటి సామూహిక బృందాలు, పంచాయతీరాజ్ సంస్థలు, స్వయం సహాయ సమూహాలు (ఎస్‌హెచ్‌జి స్ ), ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఒ స్), మహిళలు మరియు మహిళా నవపారిశ్రామికవేత్తలు, ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి.

 

 

ఎఫ్ఐడిఎఫ్ తొలి దశ లో 27 ప్రాజెక్టుల ను పూర్తి చేయడమైంది. చేపల ను పట్టడం లో పాలుపంచుకొనే 8100 కు పైగా నౌకల కోసం సురక్షితమైన లాండింగ్ ఎండ్ బెర్తింగ్ సదుపాయాల ను సిద్ధ: చేయడం పూర్తి అయింది. ఫిశ్ లాండింగ్ లో 1.09 లక్షల టన్నుల వృద్ధి నమోదు అయింది. సుమారు 3.3 లక్షల మంది మత్స్యకారుల కు మరియు ఇతర స్టేక్ హోల్డర్ లకు లబ్ధి ని చేకూర్చడం జరిగింది. ఈ క్రమం లో మరి ప్రత్యక్షం గా, పరోక్షం గా 2.5 లక్షల ఉద్యోగ అవకాశాల ను కల్పించడమైంది.

 

 

ఆర్థిక వనరుల ను విస్తరించడం వల్ల ఎఫ్ఐడిఎఫ్ కు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ రంగం నుండి, ప్రైవేటు రంగం నుండి చేపల పరిశ్రమ మరియు ఆక్వాకల్చర్.. ఈ రెండిటికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కై అధిక పెట్టుబడుల కు ప్రోత్సాహం లభించగలదు. అదే జరిగితే ఫిశరీస్ మరియు ఆక్వాకల్చర్ రంగం యొక్క విస్తరణ కు, ఆర్థికాభివృద్ధి కి దన్ను దొరుకుతుంది. ఎఫ్ఐడిఎఫ్ అనేది చేపల పరిశ్రమ మరియు ఆక్వాకల్చర్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాల ను నిర్మించడాని కి ఊతాన్ని ఇవ్వడం ఒక్కటే కాకుండా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎమ్ఎమ్‌ఎస్‌వై), ఇంకా కిసాన్ క్రెడిట్ కార్ట్ (కెసిసి) ల ఫలితాల ను అందుకోవడం లో సహాయకం గా ఉండబోతోంది; దీనితో పాటు గా ఈ రంగం లో ఆసక్తి ఉన్న వారి ని దీనిలోకి తీసుకు రావడం కోసం ఒక ముఖ్యమైన పథకం వలె మారగలదు. ఫలితం గా పెట్టుబడి, ఉపాధి అవకాశాల కల్పన, చేపల ఉత్పత్తి లో పెరుగుదల, మరియు చేపల పెంపకం, ఇంకా ఆక్వాకల్చర్ రంగం లో సకారాత్మకమైన మార్పు లు చోటు చేసుకోగలవు.

 

 

***

 



(Release ID: 2004388) Visitor Counter : 67