ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ రంగంలో విలువ జోడింపు, రైతుల ఆదాయ పెంపునకు హామీ ఇచ్చిన 2024–25 మధ్యంతర బడ్జెట్


పంట కోత అనంతర కార్యకలాపాలైన ప్రైమర, సెకండరీ ప్రాసెసింగ్, మార్కెటింగ్లో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యానికి మరింత ప్రోత్సహించనున్నట్టు ప్రకటన.

పి.ఎం. కిసాన్ సమ్మాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్ధిక సహాయం
4 కోట్ల మంది రైతులకు పిఎం. ఫసల్ భీమా యోజన కింద పంట బీమా

నూనెగింజల విషయంలో ఆత్మనిర్భరత సాధఙంచేందుకు వ్యూహ రూపకల్పన.

అన్ని వాతావరణ జోన్లలోని పంటలకు నానో డిఎపి వాడకాన్ని విస్తరింపచేసేందుకు చర్యలు

Posted On: 01 FEB 2024 12:49PM by PIB Hyderabad

కేంద్ర ఆర్ధికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  202425 ఆర్ధిక సంవత్సరానికి  పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రముఖంగా కనిపిస్తున్న వాటిలో రైతు సంక్షేమంగ్రామీణ ప్రాంత డిమాండ్ను పెంచడం ఒకటి. రైతులను మన అన్నదాతలుగా పేర్కొంటూ  శ్రీమతి సీతారామన్రైతులకు కనీసమద్దతు ధరను ఎప్పటికప్పుడు తగిన విధంగా పెంచడం జరుగుతుందన్నారు.

ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద,  చిన్నసన్నకారు రైతులతో సహా మొత్తం 11.08 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష నగదు సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. పి.ఎం.ఫసల్ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా కల్పిస్తున్నట్టు చెప్పారు.

ఈ పథకాలతో పాటుపలు ఇతర పథకాలుదేశానికి ప్రపంచానికి ఆహారం పండిస్తున్న అన్నదాతకు సహాయ పడుతున్నాయని, 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వడం ద్వారా ఆహారానికి సంబంధించిన ఆందోళనను తొలగించినట్టు తెలిపారు.

 

202425 మధ్యంతర బడ్జెట్వ్యవసాయ రంగంలో విలువజోడింపును మరింత పెంచేందుకు హామీ ఇచ్చిందని ఇదిరైతుల రాబడిని మరింత పెంచుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పంట నూర్పిడి అనంతర కార్యకలాపాలైన అగ్రిగేషన్ఆధునిక నిల్వ సదుపాయాలుసమర్ధవంతమైన సరఫరా ప్రైమరీసెకండరీ ప్రాసెసింగ్ విధానాలుమార్కెటింగ్,బ్రాండింగ్ వంటివి వ్యవసాయఆహార ప్రాసెసింగ్ రంగం వృద్ధికి దోహదపడేలా ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులను మరింత పెంచనున్నట్టు మంత్రి తెలిపారు.  ‘“ ఈ రంగం సమ్మిళితసమతూకంతో కూడిన ఉన్నతస్థాయి ప్రగతిఉత్పాదకత సాధించేదిశగా ముందుకు పోతున్నది. రైతు కేంద్రిత విధానాలుఆదాయ మద్దతురిస్క్ కవరేజజజ్మద్దతు ధరలుబీమా సదుపాయం స్టార్టప్ ల ద్వారా సాంకేతికతకు ఆవిష్కరణలకు ప్రోత్సాహం, “ వంటి వాటిని ఆర్ధిక మంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు.

 

ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ యోజన 2.4 లక్షల మంది స్వయం సహాయక బృందాల వారికి, 60 వేల మంది వ్యక్తులకు క్రెడిట్ లింకేజ్ కల్పించి సాయపడిందన్నారు. పంట నూర్పిడి అనంతర నష్టాల తగ్గింపుఉత్పాదకత ఆదాయాల పెంపు వంటి వాటి విషయంలో ఇతర పథకాలు ఒకదానికి మరొకటి అండగా ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించిందనిఇది 10 లక్షల మందికి ఉపాధి కల్పించిందన్నారు.ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ 1361 మండీలను అనుసంధానం చచేసిందనిఇది 1.8 కోట్లమంది రైతులకు సేవలు అందిస్తున్నదని దీని ట్రేడింగ్ పరిమాణం 3 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు.

 

“  ఈ చర్యలుఇతర మౌలిక అవసరాలకు సంబంధించి తీసుకున్న చర్యలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాన్ని పెంచాయి. వారి ఆర్ధిక అవసరాలను ఇవి తీరుస్తున్నాయి. దీనితో వృద్ధితోపాటు ఉపాధి కల్పన జరుగుతోంది   ”  అని ఆర్ధికమంత్రి తెలిపారు.

 

నూనె గింజల ఆత్మనిర్భర అభియాన్ :

 

కేంద్ర ఆర్ధికకార్పొరేట్ వ్వవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్దిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూనె గింజల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించేందుకు అంటే ఆవాలుపల్లీలుసోయాబీన్ పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించడం జరుగుతుందన్నారు. ఇందులో ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకాలపై పరిశోధనఆధునిక వ్యవసాయ టెక్నిక్ల వినియోగంమార్కెట్ లింకేజ్ లుప్రొక్యూర్మెంట్ విలువ జోడింపుపంట బీమావంటివి ఉన్నాయన్నారు.

నానో డిఎపి:

 

నానో యూరియాను విజయవంతంగా చేపట్టిన తర్వాతనానో డిఎపిని వివిధ ఇతర పంటలకు వినియోగించడాన్ని అన్ని వాతావరణ జోన్లకు విస్తరింప చేసేందుకు  చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర ఆర్ధికమంత్రి తమ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

 

***


(Release ID: 2001742) Visitor Counter : 312