ఆర్థిక మంత్రిత్వ శాఖ
లక్పతీ(లక్షపతి) దీదీని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
దాదాపు 1 కోటి మంది మహిళలు లక్ పతి దీదీగా మారడానికి సహకారం అందించబడింది
9 కోట్ల మంది మహిళలతో 83 లక్షల స్వయం సహాయక బృందాలు సాధికారత మరియు స్వావలంబనతో గ్రామీణ సామాజిక- ఆర్థిక దృశ్యాన్ని మారుస్తున్నాయి
Posted On:
01 FEB 2024 12:45PM by PIB Hyderabad
లక్ పతీ(లక్షపతి) దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్ లో ఈ రోజు 2024–25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడుతూ... తొమ్మిది కోట్ల మంది మహిళలతో ఎనభై మూడు లక్షల స్వయం సహాయక సంఘాలు సాధికారత మరియు స్వావలంబనతో గ్రామీణ సామాజిక-ఆర్థిక దృశ్యాన్ని మారుస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళల విజయం దాదాపు కోటి మంది మహిళలు ఇప్పటికే లక్ పతీ దీదీగా మారడానికి సహాయపడింది. స్వయం సహాయ బృందాల్లోని మహిళలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారిని సత్కరించడం ద్వారా వారి విజయాలు గుర్తించబడతాయి. ఈ విజయంతో ఉత్సాహంగా లఖ్‌పతి దీదీ లక్ష్యాన్ని పెంచామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
నాలుగు ప్రధాన ‘కులాల’పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మన ప్రధాని నరేంద్ర మోదీ దృఢంగా విశ్వసిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. . అవి, 'గరీబ్' (పేద), 'మహిళాయే' (మహిళలు), 'యువ' (యువత) మరియు 'అన్నదాత' (రైతు). " వారి అవసరాలు, వారి ఆకాంక్షలు మరియు వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ నాలుగు‘ కులాలు’ పురోగమించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఈ నాలుగు ‘కులాల’ తమ జీవితాలను మెరుగుపర్చుకోవాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని, ఆ సహకారం వారికి అందుతుందని, వారి సాధికారత మరియు శ్రేయస్సు దేశాన్ని ముందుకు నడిపిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రభుత్వం సర్వతోముఖంగా, సర్వవ్యాప్తి చెంది, అందరినీ కలుపుకొని పోయే (సర్వాంగిణ, సర్వస్పర్శి మరియు సర్వసమావేశి) అభివృద్ధి విధానంతో పని చేస్తోందని నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఇది అన్ని కులాలు మరియు అన్ని స్థాయిలల్లోని ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుందన్నారు. 2047 నాటికి భారత్‌ను ‘వికసిత్ భారత్’గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మా ప్రభుత్వం ప్రజల శక్తిసామర్థ్యాల్ని మెరుగుపర్చడంతోపాటు మరియు వారికి సాధికారత కల్పించాలని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
****
(Release ID: 2001721)
Visitor Counter : 272
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam