మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పరీక్షా పే చర్చ 2024కి సంబంధించి దేశవ్యాప్తంగా పెయింటింగ్‌ పోటీలో పాల్గొన్న 60,000 మంది విద్యార్థులు


పరీక్షా పే చర్చ 2024కు 2.26 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి

ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రధానమంత్రితో సంభాషించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో విస్తృతమైన ఉత్సాహం

Posted On: 24 JAN 2024 2:07PM by PIB Hyderabad


పరీక్షా పే చర్చ 2024కి ముందు విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా 774 జిల్లాల్లోని 657 కేంద్రీయ విద్యాలయాలు మరియు 122 నవోదయ విద్యాలయాల్లో (ఎన్‌విఎస్‌) జనవరి 23న చిత్రలేఖన పోటీని నిర్వహించడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ర‌చించిన బుక్ ఎగ్జామ్ వారియ‌ర్స్ నుండి ప‌రీక్ష మంత్రాల‌తో కూడిన ఈ మెగా ఈవెంట్‌లో 60 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంపై విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు వారిలో దేశభక్తిని పెంపొందించేందుకు ఆయన జయంతి రోజును ‘పరాక్రమ్ దివస్’గా పాటిస్తారు. ఈ స్ఫూర్తిదాయకమైన సందేశం పెయింటింగ్ పోటీ యొక్క థీమ్‌గా కూడా ఉంది.

విద్యార్థుల సృజనాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించడానికి పెయింటింగ్ పోటీతో సహా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ కార్యకలాపాలు ప్రోత్సహించబడ్డాయి. జనవరి 12 (జాతీయ యువజన దినోత్సవం) నుండి జనవరి 23 వరకు మారథాన్ రన్, మ్యూజిక్ కాంపిటీషన్, మెమ్ కాంపిటీషన్, నుక్కడ్ నాటక్, పోస్టర్ మేకింగ్ మరియు యోగా-కమ్-మెడిటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

జనవరి 23, 2024న జరిగిన పెయింటింగ్ పోటీలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

image.png

image.png

image.png

 


పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క 7వ ఎడిషన్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం "పరీక్ష పే చర్చ 2024" పాల్గొనేందుకు మైగవ్‌ పోర్టల్‌లో 2.26 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రధానమంత్రితో సంభాషించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో విస్తృతమైన ఉత్సాహం నెలకుంది.

ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమం 29 జనవరి 2024న ఉదయం 11 గంటల నుండి టౌన్ హాల్ ఆకృతిలో భారత్ మండపం,ఐటిపిఓ, ప్రగతి మైదాన్, న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. దాదాపు 3000 మంది పార్టిసిపెంట్లు ఈ కార్యక్రమంలో ప్రధానితో సంభాషించనున్నారు. ప్రతి రాష్ట్రం మరియు యుటి నుండి ఇద్దరు విద్యార్థులు మరియు ఒక ఉపాధ్యాయుడు మరియు కళా ఉత్సవ్ విజేతలు ప్రధాన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్‌) నుండి వంద (100) మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి మొదటి సారి హాజరవుతున్నారు.

పరీక్షా పే చర్చ అనేది విద్యార్ధులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని పెద్ద ఉద్యమంలో భాగం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రయత్నాల ద్వారా ప్రతి బిడ్డ యొక్క ప్రత్యేక వ్యక్తిత్వాన్ని జరుపుకునే, ప్రోత్సహించే మరియు పూర్తిగా వ్యక్తీకరించడానికి అనుమతించే వాతావరణాన్ని పెంపొందించడానికి ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క మార్గదర్శిని, అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం 'ఎగ్జామ్ వారియర్స్', ఆంగ్లం, హిందీ మరియు ఇతర ప్రధాన ప్రాంతీయ భాషలలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది.

 

***



(Release ID: 1999116) Visitor Counter : 123