మంత్రిమండలి
వైద్య చికిత్స ఉత్పాదనల క్రమబద్ధీకరణ రంగం లో సహకారం అంశం లో భారతదేశాని కి మరియు ఇక్వాడోర్ కు మధ్యకుదిరిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని (ఎమ్ఒయు) కి ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి
Posted On:
18 JAN 2024 12:58PM by PIB Hyderabad
వైద్య చికిత్స ఉత్పాదన ల క్రమబద్ధీకరణ రంగం లో సహకారం అనే అంశం లో భారత గణతంత్రాని కి చెందిన ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేశన్ (సిడిఎస్‌సిఒ) లకు మరియు ఇక్వాడోర్ గణతంత్రాని కి చెందిన ఏజెన్సియా నేశనల్ డీ రెగ్యులేశన్, కంట్రోల్ వై విజిలెన్సియా సేనిట్రియా - ఎఆర్‌సిఎస్ఎ, డాక్టర్ లియోపోల్డో ఇజ్‌క్వియెటా పెరెజ్ లకు మధ్య 2023 నవంబరు 7వ తేదీ న సంతకాలైన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గాని కి వివరించడమైంది.
ప్రయోజనం:
ఈ ఎమ్ఒయు ఉభయ పక్షాల మధ్య నియంత్రణ పరమైన అంశాల లో చక్కనైన అవగాహన కు బాట ను పరుస్తుంది; అంతేకాకుండా, వైద్య చికిత్స ఉత్పాదనల క్రమబద్దీకరణ రంగం లో సహకారాన్ని వృద్ధి చెందింప చేయడం లో మరియు అంతర్జాతీయ వేదికల లో మెరుగైన సమన్వయాని కి సాయపడగలదు.
ఉపాధి కల్పన సామర్థ్యం:
ఈ ఎమ్ఒయు కారణం గా నియంత్రణ పరమైన విధి విధానాల లో సమన్వయం తో భారతదేశం నుండి మందుల ఎగుమతి ని వృద్ధి చెందింపచేయడం లో తోడ్పాటు లభించగలదు. తత్ఫలితం గా ఔషధ నిర్మాణ సంబంధి రంగం లో విద్యావంతులైన వృత్తి నిపుణుల కు మెరుగైన ఉద్యోగ అవకాశాల ను అందుబాటు లోకి తీసుకు రావడం లో సహాయం లభించగలదు.
ఆత్మనిర్భర్ భారత్:
ఈ ఎమ్ఒయు వైద్య చికిత్స ఉత్పాదన ల ఎగుమతి కి బాట ను పరచి, విదేశీ మారక ద్రవ్యం ఆర్జన కు వీలు కల్పిస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కారం దిశ లో ఒక ముందడుగు కాగలదు.
పూర్వరంగం:
సిడిఎస్‌సిఒ అనేది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్థ్ సర్వీసెస్ పరిధి లో పని చేసేటటువంటి ఒక సహాయక కార్యాలయం; ఇది భారతదేశం లో ఔషధాలు, చికిత్స పరికరాలు మరియు సౌందర్య సాధనాల కు సంబంధించినటువంటి జాతీయ నియంత్రణాధికార పరిధి ని కలిగి ఉంది. ఏజెన్సియా నేశనల్ డీ రెగ్యులేశన్, కంట్రోల్ వై విజిలెన్సియా సేనిట్రియా - ఎఆర్‌సిఎస్ఎ, డాక్టర్ శ్రీ లియోపోల్డో ఇజ్‌క్వియెటా పెరెజ్ అనేది ఇక్వాడోర్ గణతంత్రం లో ఇదే విధమైనటువంటి ఉత్పాదనల కు సంబంధించి న క్రమబద్దీకరణ యంత్రాంగం గా ఉన్నది.
***
(Release ID: 1997430)
Visitor Counter : 106
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam