యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

డయ్యూలో 2024 బీచ్ గేమ్స్


డయ్యూలో తొలిసారిగా జరిగిన బీచ్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన మధ్యప్రదేశ్.

మహరాష్ట్రపై విజయం సాధించి బీచ్ సాకర్గోల్డ్ కైవసం చేసుకున్న లక్షద్వీప్

డయ్యూలో విజయవంతంగా ముగిసిన బీచ్ గేమ్స్ ఉత్సుకత కలిగించే సముద్రతీర క్రీడా పోటీలకు పునాది వేశాయి.: శ్రీ అనురాగ్సింగ్ ఠాకూర్

Posted On: 13 JAN 2024 12:04PM by PIB Hyderabad

బీచ్ గేమ్స్ 2024, ఇండియాలో జరిగిన తొలి బహుళ క్రీడాంశాల బీచ్ క్రీడల పోటీలు. వీటిని ,  డయ్యూలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కలిగిన సుందరమైన ఘోఘ్లా బీచ్లో నిర్వహించారు. ఈ పోటీలలో సముద్రతీర ప్రాంతంలేని మధ్యప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. 7 స్వర్ణపతకాలతో సహా మొత్తం 18   పతకాలు సాధించి ఇది ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయం క్రీడలలో మధ్యప్రదేశ్ సత్తా ఏమిటో మరో సారి తెలిసింది. రాష్ట్రంలో క్రీడా ప్రతిభగలవారు ఎందరు ఉన్నారో ఇది తెలియజేసింది.
మహారాష్ట్ర 3 స్వర్ణపతకాలతో పాటు 14 పతకాలను సాధించగాతమిళనాడుఉత్తరాఖండ్ఆతిథ్య దాద్రానాగర్ హవేలిడయ్యూ అండ్ డామన్ ఒక్కొక్కటి 12 పతకాలు సాధించాయి. అస్సాం 5 స్వర్ణపతకాలతోపాటు మొత్తం 8 పతకాలు సాధించింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే లక్షద్వీప్ బీచ్సాకర్లో స్వర్ణపతకం సాధించడం చెప్పుకోదగిన విషయం. మహారాష్ట్ర వంటి బలమైన జట్టును ఇది ఫైనల్స్లో  5–4 తేడాతో ఓడించింది. లక్షద్వీప్ విజయంపతకాలు గెలుపొందిన రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలలో వైవిధ్యతను ప్రతిబింబిస్తోంది. అంతేకాదుదేశవ్యాప్తంగా 2024 డయ్యూ బీచ్ గేమ్స్ కలిగించిన ప్రభావం సమ్మిళితత్వానికి పలు రాష్ట్రాలు సాధించిన పతకాలే నిదర్శనం.
బీచ్ గేమ్స్ పోటీలు ఈ ఏడాది జనవరి 4 నుంచి 11 వరకు జరిగాయి. 28 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1404 మంది అథ్లెట్లు 21 సంవత్సరాల లోపు వారు ఈ పోటీలలో పాల్గొన్నారు.వివిధ క్రీడాంశాలకు సంబంధించి 205 మంది మ్యాచ్ నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.. ఈ పోటీలను రోజుకు రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయపు సెషన్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగామధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3 గంటలనుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమయాల వల్ల క్రీడాకారులు ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ మెరుగైన పనితీరును కనబరచడానికి ఇది వీలు కల్పించింది. ఆలాగే వీక్షకులకు కూడా ఈ సమయం ఎంతో అనువుగాఉంది.

ఉత్కంఠభరితంగా సాగిన సముద్ర స్విమ్మింగ్,పోటీలుపెనకాసిలాత్ నైపుణ్యాలుమల్లఖంబ్ ఆక్రోబాటిక్ ఫీట్లుబీచ్ వాలీబాల్ పోటీలుబీచ్ కబడ్డీబీచ్ సాకర్ ఇలా ప్రతి ఒక్క క్రీడాంశాల పోటీలు దేనికదే ప్రత్యేకతతో సాగాయి. బీచ్ బాక్సింగ్ మరింత ఉత్సుకత రేపింది. ఇది అటు ఈ పోటీలలో పాల్గొన్న వారికి,వీక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇది దేశ క్రీడారంగ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు.

కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో (పూర్వపు ట్విట్టర్) లో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూఈ క్రీడలకు తమ మద్దతు తెలిపారు. డయ్యూ అందానికి అథ్లెట్ల ఎనర్జీ తోడై ఈ క్రీడలకు మరింత వన్నెతెచ్చిందని ఆయన పేర్కన్నారు.. భారత దేశ తీరప్రాంతాలకు కొత్త జీవితం తీసుకురావాలన్నప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతఈ బీచ్ క్రీడలకు కారణమైందని అన్నారు. డయ్యూలో బీచ్ గేమ్స్ తొలిసారిగా నిర్వహించడం ఇందుకు నిదర్శనమన్నారు.

భారతదేశానికి భౌగోళికంగా, అద్భుతమైన తీర రేఖ ఉండడం మన అదృష్టం. ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్లు చాలావరకు ఇండియాలో ఉన్నాయి. దేశంలోని 12 బీచ్లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. అత్యంత పరిశుభ్రమైన బీచ్లుగా వీటికి పేరు .ఇవి సుస్థిర పర్యాటకాన్ని ప్రొత్సహిస్తున్నాయి. నిజానికి ఇంకా ఎన్నో బీచ్లు ఈ స్థాయిలో ఉన్నాయి. వాటికి గుర్తింపు తీసుకురావలసి   ఉంది. ఈ దిశగా బీచ్ గేమ్స్ డయ్యూలో  నిర్వహించడం సంతోషం కలిగించే విషయం.

డయ్యూలో జరిగిన 2024 బీచ్ గేమ్స్ ఫోటోలు.....



(Release ID: 1996564) Visitor Counter : 116