ప్రధాన మంత్రి కార్యాలయం
ఆలయ ప్రాంగణాల్లో పరిశుభ్రత సంబంధ కార్యక్రమాలపై ప్రధాని ప్రశంస
प्रविष्टि तिथि:
14 JAN 2024 9:58PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఆలయ ప్రాంగణాల్లో పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అయోధ్య క్షేత్రంలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంలో మకర సంక్రాంతి నాడు ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
‘‘ఆలయ ప్రాంగణాల్లో రోజంతా పరిశుభ్రత సంబంధ కార్యకలాపాలు కొనసాగుతున్న అసాధారణ కృషిని నేను గమనించాను. ఈ కృషిని అన్నివర్గాల ప్రజలూ పూర్తిస్థాయిలో సుసంపన్నం చేయడం ముదావహం. భవిష్యత్తులోనూ ఇలాంటివాటిని ‘నమో’ అనువర్తనం (nm-4.com/swachhteerth) ద్వారా పంచుకోండి’’ అని పిలుపునిచ్చారు.
(रिलीज़ आईडी: 1996429)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam