ప్రధాన మంత్రి కార్యాలయం
వరుసగా నాలుగో సారి కూడా విజయం సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు పిఎం అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
08 JAN 2024 7:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాతో మాట్లాడారు. పార్లమెంటరీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి చారిత్రక విజయం సాధించినందుకు ఆమెను అభినందించారు.
ఈ మేరకు పిఎం ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాతో మాట్లాడి పార్లమెంటరీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి చారిత్రక విజయం సాధించినందుకు అభినందించాను. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించుకున్న బంగ్లాదేశ్ ప్రజలకు కూడా నేను అభినందనలు తెలియచేశాను. బంగ్లాదేశ్ తో దీర్ఘకాలికంగా సాగుతున్న బంధాన్ని, ప్రజలే ప్రధానంగా గల భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని అందులో పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1994516)
సందర్శకుల సూచీ సంఖ్య : : 263
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam