ప్రధాన మంత్రి కార్యాలయం

ఆదిత్య-ఎల్1 తనగమ్యస్థానాన్ని చేరుకోవడం తో ప్రసన్నత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 06 JAN 2024 5:10PM by PIB Hyderabad

భారతదేశానికి చెందిన సౌర గ్రహ పరిశీలన ప్రధానమైనటువంటి ఒకటో ఉపగ్రహం ఆదిత్య- ఎల్1 తన గమ్యస్థానాన్ని ఈ రోజు న చేరుకోవడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

 

ఈ కార్యసాధన మన శాస్త్రవేత్త ల సమర్పణ భావానికి ఒక నిదర్శన గా ఉంది ఆయన అభివర్ణిస్తూ, మనం మానవ జాతి యొక్క మేలు కై విజ్ఞాన శాస్త్రం యొక్క క్రొత్త ఎల్లల ను విస్తరిస్తూనే ఉందాం అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం ద్వారా ఈ క్రింది విధం గా తన స్పందన ను తెలియజేశారు.

‘‘భారతదేశం మరొక కార్యసాధన ను చేజిక్కించుకొన్నది. భారతదేశం యొక్క సౌర గ్రహ పరిశీలన ప్రధానమైనటువంటి ఒకటో ఉపగ్రహం ఆదిత్య-ఎల్1 తన కు నిర్దేశించినటువంటి గమ్యస్థానానికి చేరుకొన్నది. ఇది అన్నిటికంటే జటిలం అయినటువంటి మరియు కఠినం అయినటువంటి అంతరిక్ష సాహస యాత్రల లో ఒకదానిని నెరవేర్చడం లో మన వైజ్ఞానికుల అలుపెరుగనటువంటి సమర్పణ భావానికి ఒక ప్రమాణం గా ఉన్నది. నేను ఈ యొక్క అసాధారణం అయినటువంటి కార్యసాధన ను ప్రశంసించడం లో దేశ ప్రజల తో మమేకం అవుతున్నాను. మనం మానవ జాతి యొక్క మేలు కోసం విజ్ఞానశాస్త్రం యొక్క క్రొత్త సరిహద్దుల ను దాటుకొంటూ మరింత ముందుకు సాగిపోతూనే ఉందాం.’’

 

 

India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this…

— Narendra Modi (@narendramodi) January 6, 2024

***

DS/RT



(Release ID: 1993924) Visitor Counter : 144