ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం మరియు సౌదీ అరేబియా ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు భవిష్యత్తు అనే అంశం లో ప్రిన్స్ శ్రీ మొహమ్మద్ బిన్ సల్‌మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి
పశ్చిమ ఆసియా లో స్థితి ని గురించి ఇద్దరు నేతలు వారివారి అభిప్రాయాల ను ఒకరికి మరొకరు తెలియ జేసుకొన్నారు. ఉగ్రవాదం, హింస, ఇంకా పౌరుల మరణాల కు సంబంధించి వారు వారి యొక్క ఆందోళనల ను వెలిబుచ్చారు
Posted On:
26 DEC 2023 7:48PM by PIB Hyderabad
భారతదేశం మరియు సౌదీ అరేబియా ల వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే కాలం లో ఏ విధం గా కొనసాగాలన్న అంశం పై ప్రిన్స్ శ్రీ మొహమ్మద్ బిన్ సల్‌మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా వ్రాశారు :
‘‘భారతదేశం మరియు సౌదీ అరేబియా ల వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే కాలం లో ఏ విధం గా ముందుకు సాగాలి అనే అంశం లో నా సోదరుడు ప్రిన్స్ శ్రీ మొహమ్మద్ బిన్ సల్‌మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తో ఒక చక్కని సంభాషణ ను జరిపాను. మేం పశ్చిమ ఆసియా లో స్థితి ని గురించి న మా యొక్క అభిప్రాయాల ను ఒకరి కి మరొకరం తెలియ జేసుకొన్నాం. ఉగ్రవాదం, హింస, ఇంకా ప్రజల ప్రాణాల కు కలుగుతున్న హాని ల విషయం లో మా ఆందోళనల ను ఒకరి దృష్టి కి మరొకరం తీసుకు వచ్చాం. ఆ ప్రాంతం లో శాంతి, భద్రత, ఇంకా స్థిరత్వం ల కోసం కలసి పని చేయాలి అని అంగీకరించాం.’’
(Release ID: 1990769)
Visitor Counter : 83
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam