సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన: పొగ రహిత వంటశాలల కల సాకారం


వికాసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సందర్భంగా పథకం యొక్క సానుకూల ప్రభావాన్ని వివరించిన పలువురు లబ్దిదారు

Posted On: 19 DEC 2023 12:49PM by PIB Hyderabad

పీఎం ఉజ్వల యోజన కింద ఎల్పీజీ  సిలిండర్‌ను పొందిన తర్వాత తమ జీవితాల్లో జరిగిన మార్పును పలువురు మహిళా లబ్దిదారులు ప్రస్తుతం కొనసాగుతున్న వికాసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో పంచుకున్నారు. ఇందులో విశేషమేమిటంటే ఎల్పీజీ సిలిండర్‌ను అందించడం వంటి సాధారణ విషయం దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలకు బహుళ ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. సాంప్రదాయ వంట చెరకుతో చేసే వంటలో ఉండే అనారోగ్య పొగ నుండి విముక్తి పొందడం పట్ల కొందరు సంతోషిస్తారు. అలాగే ఇంకొంతమంది  కట్టెలు సేకరించడానికి పడిన సమయం మరియు శ్రమను ఆదా చేయగలుగుతారు.

యాత్ర మొదలైన  తొలి నెలలోనే  దాదాపు 3.77 లక్షల మంది మహిళలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. 2016లో ప్రారంభించినప్పటి నుండి ఈ పథకం కింద ఇప్పటికే లబ్ది పొందిన కోట్లాది మందితో పాటు..యాత్రలో పలువురు మహిళలు పంచుకున్న అనుభవాలను పరిశీలిస్తే  ఒకరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కోట్లాది మంది మహిళలకు మెరుగైన జీవన నాణ్యతను తీసుకురావడానికి నిజంగా గొప్ప గేమ్ ఛేంజర్ అని సురక్షితంగా నిర్ధారించవచ్చు. అందులో భాగంగా షిమా కుమారి మరియు బచన్ దేవిల  సాక్ష్యాలను పరిశీలించవచ్చు.

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాకు చెందిన సీమా కుమారి తన వంటగదిలో రోజూ సవాళ్లను ఎదుర్కొనేది. అనేక భారతీయ గృహాల మాదిరిగానే శ్రీమతి సీమా కుమారి సంప్రదాయ వంట పద్ధతులకు కట్టుబడి ఉంది. ఆమె ప్రతిరోజూ కట్టెలు సేకరించవలసి ఉండేది. వంటనుండి వెలువడే పొగ కారణంగా ఆమె తలనొప్పితో బాధపడేది అలాగే ఈ సాంప్రదాయ వంట పద్ధతులతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. కట్టెలతో వంట చేయడానికి సమయం కూడా ఎక్కువగా పడుతుంది. ఈ  దినచర్య ఆమెకు కష్టతరంగా మారింది. పొగ రహిత వంటగది ఆలోచన ఆమెకు సుదూర కలలా అనిపించింది.

 

f5258110-7ee9-4f54-a3a4-94c9bb941eb5.png

అయితే, 'ప్రధాని మంత్రి ఉజ్వల యోజన' ద్వారా ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఎల్పీజీ  సిలిండర్‌ను పొందిన తర్వాత ఆమె వంటగది రూపాంతరం చెందింది. పొగ నుండి ఆమెకు విముక్తి లభించింది. ఎల్పీజీ  సిలిండర్‌తో ఆమె ఇప్పుడు త్వరగా భోజనం వండగలదు. సమయానుకూలంగా మరియు అవాంతరాలు లేని వంటను పొందగలదు. ఈ సౌలభ్యం ఆమె పిల్లలకు భోజనాన్ని తయారు చేయడం చాలా సులభం చేసింది. తన జీవితాన్ని గణనీయంగా మెరుగుపరిచినందుకు ఈ అమూల్యమైన సహాయానికి షిమా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన బచన్ దేవి కూడా ఇలాంటి పోరాటాలను చవిచూసింది. కట్టెలు సేకరించడం మరియు హడావుడిగా భోజనం సిద్ధం చేయడం వంటి ఇబ్బందులు ఆమెకు దూరమయ్యాయి. గతంలో ఆమెకు వంట చేయడం అనేది అంతం లేనిదిగా అనిపించే సవాలుతో కూడిన దినచర్య. శ్రీమతి బచన్ దేవి ఈ కష్టాల నుండి బయటపడే మార్గం లేదని భావించినప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల పథకం ఆమె జీవితంలో ఊహించని సానుకూల మార్పును తీసుకొచ్చింది. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ అందుకోవడం ఆమె జీవితాన్ని  మార్చింది. శ్రీమతి బచన్ దేవి సిలిండర్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనలేని కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ పథకం ద్వారా ఆమె కట్టెలు సేకరించే పని నుండి విముక్తి పొందింది. ఈ కొత్త సౌలభ్యం ఆమె తన పిల్లలకు సకాలంలో భోజనం వండడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఆమెకు వంట కష్టం నుండి విముక్తి కల్పించింది.

 

image.png


ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు ముందు జీవితం

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన తీసుకొచ్చిన విప్లవానికి ముందు కోట్లాది గృహాలు సాంప్రదాయ వంట ఇంధనాలైన కట్టెలు, బొగ్గు మరియు ఆవు పేడ పిడకలను ఉపయోగించవలసి వచ్చింది. భారతీయ మహిళలు పొగవెలువడే వంటశాలలలో భోజనం తయారు చేయడం వల్ల దగ్గు మరియు రోజంతా ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడటం సర్వసాధారణం. ఇది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణ ఆందోళనలకు కూడా దోహదపడింది.

చాలా మంది మహిళలు, పొగ మరియు హానికరమైన కణాల మధ్య ఎప్పుడైనా ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలనే ఆశను వదులుకున్నారు. అయితే గ్రామీణ మరియు వెనుకబడిన కుటుంబాలకు ఎల్పీజీ వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం మే 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై)ని ప్రారంభించింది. ఈ చొరవ తరతరాలుగా కష్టాలను అనుభవించిన భారతీయ మహిళలకు ఒక విముక్తి అనుభవాన్ని అందించింది. తద్వారా చివరకు పొగ రహిత వంటగది కలను సాకారం చేసింది.

సీమా కుమారి మరియు బచన్ దేవి కథలు భారతదేశం అంతటా లెక్కలేనన్ని స్త్రీలతో ప్రతిధ్వనించాయి. వారి పేర్లు, సంస్కృతులు మరియు నేపథ్యాలు భిన్నంగా ఉన్నప్పటికీ వారు ఉమ్మడి భావోద్వేగాన్ని పంచుకుంటారు. వారంతా సంవత్సరాల పోరాటం నుండి ఉపశమనం మరియు వారి జీవితంలో సానుకూల మార్పు కోసం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు.

రిఫరెన్స్‌లు:

https://www.youtube.com/watch?v=DFKQnTQpoj0&authuser=0

 

***


(Release ID: 1988521) Visitor Counter : 186