ప్రధాన మంత్రి కార్యాలయం
విద్యార్థులను ఒత్తిడి నుంచి విజయం దిశగా నడిపే సాధనమే పరీక్షా పే చర్చ, వారు దరహాసంలో పరీక్షలకు వెళ్లేలా అది చేస్తుంది : ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 DEC 2023 9:50PM by PIB Hyderabad
విద్యార్థులను ఒత్తిడి నుంచి విజయం దిశగా నడిపించడం, వారు దరహాసంతో పరీక్షకు కూచునేలా చేయడం పరీక్షా పే చర్చ లక్ష్యం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పరీక్షా పే చర్చ 2024 కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని విద్యా మంత్రిత్వ శాఖ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆహ్వానించింది.
ఈ దిగువన ఇచ్చిన వెబ్ సైట్ లోకి వెళ్లడం ద్వారా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ పిఎం శ్రీ నరేంద్ర మోదీతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం పొందవచ్చునని విద్యా మంత్రిత్వ శాఖ ఆ పోస్ట్ లో తెలిపింది. ఆ లింక్ ఇదే.
https://innovateindia.mygov.in/ppc-2024/
విద్యా మంత్రిత్వ శాఖ ఎక్స్ పోస్ట్ కు ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా స్పందిస్తూ
‘‘ఒత్తిడిని విజయంగా మార్చడం, విద్యార్థులు #ExamWarrior దరహాసంతో పరీక్షలకు వెళ్లేలా చేయడం పరీక్షా పే చర్చ #ParikshaPeCharcha లక్ష్యం. మన పరస్పర సంభాషణ ద్వారా పెద్ద స్టడీ టిప్ రావచ్చునేమో ఎవరికి తెలుసు’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1986573)
आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam