ప్రధాన మంత్రి కార్యాలయం

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర (విబిఎస్వై) లబ్ధిదారు, చండీఘడ్కు చెందిన ట్రాన్స్జెండర్ అద్భుత స్ఫూర్తిని ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సమజంలోని ప్రతి స్థాయికీ విస్తరించింది’’ : ప్రధానమంత్రి

Posted On: 09 DEC 2023 2:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర (విబిఎస్వై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు విబిఎస్వై పథకం కింద ప్రధానమంత్రి లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారితో మాట్లాడారు. నిర్ణీత కాలవ్యవధిలో లబ్ధిదారులకు ఈ పథకాలు చేరేందుకు వీలుగా విబిఎస్వై నిర్వహిస్తున్నారు.

 

 చండీఘడ్కు చెందిన విబిఎస్వై లబ్ధిదారు ,ట్రాన్స్జెండర్ శ్రీమతి మోనా , తాను వాస్తవానికి జార్ఖండ్లోని రాంచీ కి చెందిన వ్యక్తినని ప్రధానమంత్రికి తెలిపారు. ప్రస్తుతం తాను చండీఘడ్లో ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చాయ్ దుకాణం నడుపుతున్నట్టు తెలిపారు 

తాను ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద పది వేల రూపాయల రుణం పొందినట్టు శ్రీమతి మోనా తెలిపారు.దానిని ఉపయోగించి చాయ్దుకాణం పెట్టుకున్నట్టు తెలిపారు. రుణం గురించి తనకు నగర మునిసిపల్ కార్పొరేషన్ సమాచారం అందించినట్టు తెలిపారు. మోనిక టీ స్టాల్ లో గరిష్ఠంగా లావాదేవీలు యుపిఐ, లో జరుగుతున్నాయి. అదనపు రుణానికి బ్యాంకులు ఆమెను సంప్రదించాయా లేదా అని ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. మొదట రుణం తీసుకున్న తర్వాత తాను 20,000 రూపాయలు, 50,000 రూపాయల రుణం తీసుకున్నట్టు తెలిపారు. మోనిక ఇప్పుడు సున్నా వడ్డీతో రుణం పొందే  మూడో స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

 

ట్రాన్స్జెండర్ సమాజం నుంచి మరింత మంది ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవలసిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇలాంటి పథకాలు అందిపుచ్చుకోవడం మరెందరికో ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ స్ఫూర్తి అయిన సబ్ కా సాథ్, సబ్ కావికాస్ అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రభుత్వ చర్యలు సరైన దిశగా సాగుతుండడం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.


అస్సాం రైల్వే స్టేషన్ లోని అన్ని షాపుల కార్యకలాపాలను ట్రాన్స్జెండర్ సమాజానికి చెందిన వారికి అప్పగించేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. వారి వ్యాపారం బాగా వృద్ధి చెందుతున్నట్టు ఆయన తెలిపారు. మోనా తన చాయ్దుకాణ వ్యాపారంలో పురోగతి సాధిస్తున్నందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

 

****

 



(Release ID: 1985892) Visitor Counter : 72