ప్రధాన మంత్రి కార్యాలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
Posted On:
01 DEC 2023 7:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘యుఎఇ’లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మాననీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు.
కాప్-28 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ప్రధానమంత్రి అభినందించారు. అలాగే కాప్-28 వేదికపై హరిత వాతావరణ కార్యక్రమం (జిసిపి)పై ఉన్నతస్థాయి కార్యక్రమానికి సహాధ్యక్షత వహించడంపైనా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల విస్తృత-శక్తివంతమైన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే ఇజ్రాయెల్-హమాస్ వివాదంపైనా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, వచ్చే నెల ‘ఉజ్వల గుజరాత్’ సదస్సు నిర్వహణ నేపథ్యంలో భారత పర్యటనకు రావాల్సిందిగా మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధానమంత్రి ఆహ్వానించారు.
****
(Release ID: 1981802)
Visitor Counter : 98
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam