ప్రధాన మంత్రి కార్యాలయం

మేరీ మాటీ మేరాదేశ్ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం లో పాలుపంచుకొంటున్న వారందరి ప్రయాసల ను  ప్రశంసించిన ప్రధాన మంత్రి


మేరీ మాటీ మేరాదేశ్ కార్యక్రమం లో భాగం గా సెల్ఫీ విద్ మేరీ మాటీ ప్రచార ఉద్యమాన్ని నిర్వహించిన సావిత్రిబాయిఫులే పుణె విశ్వవిద్యాలయం.

Posted On: 10 NOV 2023 8:10PM by PIB Hyderabad

మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం లో పాలుపంచుకొంటున్న వారందరి ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

 

మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమం లో భాగం గా సెల్ఫీ విద్ మేరీ మాటీ ప్రచార ఉద్యమాన్ని సావిత్రిబాయి ఫులే పుణె విశ్వవిద్యాలయం నిర్వహించింది.

 

 

ఈ ప్రచార ఉద్యమం లో నలభై విశ్వవిద్యాలయాల కు చెందిన ఏడు వేల కళాశాల ల విద్యార్థులు 25 లక్షల మంది కి పైగా పాలుపంచుకొనడం తో ఈ ప్రచార ఉద్యమం భారీ భాగస్వామ్యం కారణం గా గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్ లో చోటు చేసుకొన్నది.

 

 

ఈ ప్రచార ఉద్యమాన్ని గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన అభిప్రాయాల కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు..

या प्रयत्नामध्ये सहभागी असलेल्या सर्वांची मी प्रशंसा करतो, ज्यांनी #MeriMaatiMeraDesh चळवळीला मोठ्या प्रमाणावर चालना दिली आहे आणि एका प्रकारे राष्ट्रीय अभिमान आणि एकात्मतेच्या भावनेला प्रोत्साहित केले आहे.

 

*******

Dhiraj Singh/Siddhant Tiwari



(Release ID: 1976586) Visitor Counter : 83