ప్రధాన మంత్రి కార్యాలయం
ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ
పశ్చిమాసియాలో పరిస్థితులు.. విస్తృత పరిణామాలపై దేశాధినేతల చర్చ;
ఉగ్రవాదం.. హింస.. పౌర ప్రాణనష్టంపై ఇద్దరు అధినేతల ఆందోళన;
ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారత దీర్ఘకాలిక-
సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి;
పాలస్తీనా ప్రజలకు భారత ప్రగతి భాగస్వామ్యం..
మానవతా సాయంపై నొక్కిచెప్పిన ప్రధానమంత్రి;
శాంతి.. సుస్థిరతల సత్వర పునరుద్ధరణపై నేతలిద్దరి ఏకాభిప్రాయం;
Posted On:
28 OCT 2023 11:00PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఈజిప్ట్ అధ్యక్షుడు మాననీయ అబ్దేల్ ఫతా అల్-సిసితో టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు.. ఆ ప్రాంతంతోపాటు ప్రపంచంపై దాని విస్తృత పర్యవసానాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు.
ఉగ్రవాదం.. హింస.. పౌర ప్రాణనష్టంపై ఇద్దరు దేశాధినేతలు ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారత దీర్ఘకాలిక-సూత్రప్రాయ వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
పాలస్తీనా ప్రజలకు భారత ప్రగతి భాగస్వామ్యం, మానవతా సహాయ సౌలభ్యం కల్పన గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల సత్వర పునరుద్ధరణతోపాటు బాధిత ప్రజానీకానికి మానవతా సహాయం అందించడంపై దేశాధినేతలిద్దదరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
******
(Release ID: 1972824)
Visitor Counter : 153
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam