ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల షాట్‌పుట్‌లో కాంస్య పతక విజేత మనుకు ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2023 6:49PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘షాట్‌పుట్ ఎఫ్-37’లో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారుడు మనుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మను ప్రదర్శించిన అసమాన శక్తిసామర్థ్యాలు దేశం గర్వించే విజయానికి దోహదం చేశాయని ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘షాట్‌పుట్ ఎఫ్-37’లో కాంస్య పతకం సాధించిన మనుకు నా అభినందనలు! అతని అద్భుత శక్తి, నైపుణ్యం మన దేశానికి గర్వకారణం. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1972425)
సందర్శకుల సూచీ సంఖ్య : : 121
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam