ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్ లో సుమిత్ ఆంటిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకం గెలిచినందుకు ప్రధానమంత్రి హర్షం

प्रविष्टि तिथि: 25 OCT 2023 1:24PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్  ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్  లో పారా ఆసియన్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకం గెలుచుకున్న సుమిత్ ఆంటిల్  ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘ఎంత అద్భుత విజయం.

ఆసియన్  పారా గేమ్స్  లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్  లో  సుమిత్  ఆంటిల్  ప్రపంచ రికార్డు, పారా ఆసియన్  రికార్డు, గేమ్స్  రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం సాధించాడు.

సుమిత్  అసలు సిసలైన చాంపియన్. ఈ అద్భుత ప్రదర్శన అతనిలోని అసాధారణ శక్తికి, నైపుణ్యానికి నిదర్శనం.

అమిత గర్వంతో భారతదేశం ఈ విజయాన్ని వేడుక చేసుకుంటోంది’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971908) आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada