ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారాగేమ్స్ లో 73 పతకాల ను  భారతదేశం గెలుచుకోవడం తో పాటు మరి ఈ పరంపర ను కొనసాగిస్తూ ఉండడాన్నికూడాను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 26 OCT 2023 12:34PM by PIB Hyderabad

జకార్తా లో 2018వ సంవత్సరం లో జరిగిన ఏశియాన్ పారా గేమ్స్ లో 72 పతకాల ఇదివరకటి రికార్డు ను అధిగమిస్తూ భారతదేశం వర్తమాన ఏశియాన్ పారా గేమ్స్ లో రికార్డు స్థాయి లో 73 పతకాల ను గెలుచుకోవడం తో పాటు గా ఈ పరంపర ను కొనసాగిస్తుండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. పారా క్రీడాకారుల మరియు పారా క్రీడాకారిణుల యొక్క సమర్పణభావం, దృఢత్వం మరియు అచంచలమైనటువంటి నిబద్ధతల ను శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘జకార్తా లో జరిగిన 2018 ఏశియాన్ పారా గేమ్స్ లో సాధించిన 72 పతకాల మునుపటి రికార్డు ను అధిగమిస్తూ వర్తమాన ఏశియాన్ పారా గేమ్స్ లో బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి ని కైవసం చేసుకొన్న భారతదేశం ఇదివరకు ఎరుగని విధం గా 73 పతకాల ను చేజిక్కించుకోవడమే కాకుండా ఈ పరంపర ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది.

ఈ గొప్పదైనటువంటి సందర్భం మన క్రీడాకారుల మరియు మన క్రీడాకారిణుల మొక్కవోని దృఢ సంకల్పాని కి ప్రతీక గా ఉన్నది.

చరిత్ర లో తమ పేరులను లిఖించుకొన్న మరియు భారతదేశం లో ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎంతో సంతోషం తో నింపి వేసిన మన అసాధారణమైనటువంటి పారా- ఎథ్ లీట్ లకు భవ్యమైన అభినందన.

వారి యొక్క సమర్పణభావం, దృఢత్వం మరియు ఉత్కృష్టత ను ప్రాప్తింపచేసుకోవాలన్న గొప్పదైన కోరిక లు నిజం గానే ప్రేరణదాయకం గా ఉన్నాయి.

ఈ చరిత్రాత్మకమైనటువంటి కార్యసిద్ధి మార్గదర్శకంగా నిలచి భావి తరాల కు ప్రేరణ ను అందిస్తూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1971779) Visitor Counter : 51