ప్రధాన మంత్రి కార్యాలయం
పారా ఆసియా క్రీడలు 2022లో మహిళల లాంగ్ జంప్ టీ47 ఫైనల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన నిమిషాను అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 OCT 2023 7:52PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా క్రీడలు 2022లో మహిళల లాంగ్ జంప్ టీ47 ఫైనల్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించినందుకు నిమిషాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ సామజిక మాధ్యమంలో ఈ మేరకు పోస్ట్ చేసారు:
“మహిళల లాంగ్ జంప్ టీ47 ఫైనల్‌లో ఆసియా పారా గేమ్స్‌లో గోల్డెన్ విజయం సాధించిన నిమిషాకు చాలా అభినందనలు. ఈ విజయం మనలో గర్వాన్ని, స్ఫూర్తిని నింపుతుంది. ఆమె రాబోయే ప్రయత్నాలు కూడా విజయవంతం కావాలని శుభాకాంక్షలు. ” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1971765)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada