ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ మహిళల ‘ఆర్2-10మీ.ఎయిర్ రైఫిల్-స్టాండ్ ఎస్‌హెచ్1’లో స్వర్ణం గెలిచిన అవనీ లేఖరాకు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
23 OCT 2023 6:27PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 మహిళల ‘ఆర్2-10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండ్-ఎస్‌హెచ్1’లో స్వర్ణ పతక విజేత అవనీ లేఖరాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ మహిళల ‘ఆర్2-10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండ్-ఎస్‌హెచ్1’లో స్వర్ణం సాధించిన అవని లేఖరాకు నా అభినందనలు. ఆమె అపూర్వ నైపుణ్యం, దృఢ సంకల్పం మన దేశం గర్వించదగిన మరో విజయాన్ని సాధించిపెట్టాయి! భవిష్యత్తులోనూ ఆమె మరెన్నో విజయాలతో ప్రపంచమంతటా భారత కీర్తిపతాకను రెపరెపలాడించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1970876)
आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil