ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘హైజంప్‌- టి47’లో రజత పతక విజేత రాంపాల్‌కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 23 OCT 2023 5:41PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో పురుషుల ‘హైజంప్‌- టి47’లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు రాంపాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్-2022లో పురుషుల ‘హైజంప్‌- టి47’లో తిరుగులేని ప్రతిభతో రజత పతకం కైవసం చేసుకున్న రాంపాల్‌కు నా అభినందనలు. అతని విజయంతో యావద్బారతం ఉప్పొంగిపోతోంది. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1970873) आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil