ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పిఎం స్వనిధి పథకం పరివర్తిత ప్రభావాన్ని ఆమోదించిన పిఎం

प्रविष्टि तिथि: 24 OCT 2023 7:19PM by PIB Hyderabad

పిఎం స్వనిధి పథకం పరివర్తిత ప్రభావంపై స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఎస్  బిఐ ప్రచురించిన లోతైన పరిశీలనతో కూడిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ షేర్  చేశారు.

ఎస్ బిఐ గ్రూప్  ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్  నిర్వహించిన పరిశోధన స్కీమ్  సమ్మిళిత స్వభావం గురించి ఈ వ్యాసంలో వివరించడమే కాకుండా అది ఏ విధంగా ఆర్థిక సాధికారత తెచ్చింది ప్రముఖంగా వివరించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘స్టేట్  బ్యాంక్  ఆఫ్  ఇండియా ముఖ్య ఆర్థిక  సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ రచించిన లోతైన అవగాహనతో కూడిన పరిశోధన పత్రం పిఎం స్వనిధి పథకం పరివర్తిత ప్రభావంపై స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. స్కీమ్  సమ్మిళిత ప్రభావాన్ని, అది ఏ విధంగా ఆర్థిక సాధికారత తెచ్చిందన్న అంశాలను అందులో వివరించారు’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1970852) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam