ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో పురుషుల హై జంప్ టి63 ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచినందుకు శ్రీమరియప్పన్ తంగవేలు కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 OCT 2023 1:15PM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా నిర్వహించిన పురుషుల హై జంప్ టి63 ఈవెంట్ లో రజత పతకాన్ని శ్రీ మరియప్పన్ తంగవేలు గెలుచుకోవడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో విశేషమైన ఆటతీరు కు గాను శ్రీ మరియప్పన్ థంగవేలు కు అనేకానేక అభినందన లు. పురుషుల హై జంప్ టి63 పోటీ లో వెండి పతకాన్ని సాధించడం ఆయన యొక్క ఉత్కృష్ఠమైన ప్రతిభ కు మరియు దృఢ సంకల్పాని కి ఒక నిదర్శన గా ఉంది. ఆయన భావి ప్రయాసల లో సైతం రాణించాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1970058) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada