హోం మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్ లోని సీల్దాలో శ్రీరామాలయం నేపథ్యం గల దుర్గా పూజ మండపాన్ని ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కాకముందే ఈ దుర్గా మండపం రామ మందిర సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తోంది‘

సత్యాన్ని కాపాడటానికి దుర్గామాత రక్తబీజ్ నుండి శుభ-నిశుంభ వరకు అనేక మంది రాక్షసులతో పోరాడి చంపింది: బెంగాల్ మొత్తం దుర్గామాత భక్తిలో మునిగి పోయిన ఈ తొమ్మిది రోజులు పశ్చిమ బెంగాల్ కు పండుగ రోజులు.

బెంగాల్ సహా యావత్ దేశ ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని దుర్గామాతను ప్రార్థించడానికి,
దుర్గామాత ఆశీస్సులు పొందడానికి పశ్చిమ బెంగాల్ వచ్చాను: కేంద్ర హోంమంత్రి

బెంగాల్ నుంచి అవినీతి, అన్యాయాలు, దౌర్జన్యాలను త్వరగా అంతమొందించే శక్తిని ఇవ్వాలని కూడా దుర్గామాతను ప్రార్థిస్తున్నా: అమిత్ షా

Posted On: 16 OCT 2023 6:52PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్ లోని సీల్దాలో శ్రీరామాలయం నేపథ్యం గల దుర్గా పూజ మండపాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ,  దుర్గామాత ఆశీస్సులు పొందడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు. దుర్గామాత ఎల్లప్పుడూ సత్యాన్ని రక్షించడానికి పోరాడిందని, రక్తబీజ్ నుండి శుభ-నిశుంబ వరకు అనేక మంది రాక్షసులను సంహరించిందని ఆయన అన్నారు. ఈ తొమ్మిది రోజులు పశ్చిమ బెంగాల్ కు పండుగ రోజులని, బెంగాల్ అంతటా ఉన్న మండపాలన్నీ దుర్గామాత భక్తిలో మునిగిపోయాయని శ్రీ షా అన్నారు.

 

నవరాత్రుల సందర్భంగా దేశం మొత్తం దుర్గామాతను వివిధ రూపాల్లో పూజిస్తుందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. గుజరాత్ లో దుర్గామాత మండపాన్ని అలంకరించి పూజ చేస్తారు, తూర్పు భారతదేశంలో, ప్రజలు దుర్గా పూజ మండపాలలో శక్తిని ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలో కూడా ప్రజలు అనేక సంప్రదాయాలతో శక్తిని ఆరాధిస్తారు. బెంగాల్ సహా యావత్ దేశ ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలగాలని దుర్గామాతను ప్రార్థించడానికి వచ్చానని శ్రీ అమిత్ షా తెలిపారు. బెంగాల్ నుంచి అవినీతి, అన్యాయాలు, దౌర్జన్యాలను అంతమొందించే శక్తిని ఇవ్వాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామమందిరం పూర్తి కాకముందే ఈ దుర్గా మండపం రామ మందిర సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తోందని ఆయన అన్నారు.

***



(Release ID: 1968282) Visitor Counter : 49