ప్రధాన మంత్రి కార్యాలయం

డిఏఆర్పిజి లో రెండో వారం ప్రత్యేక ప్రచారం 3.0, మొదటి వారం ఉత్సాహంతోనే కొనసాగింది


డిఏఆర్పిజి లో రెండో వారం ప్రత్యేక ప్రచారం 3.0లో వివిధ కార్యకలాపాలలో గొప్ప
ఉత్సాహంగా పాల్గొన్న అందరు అధికారులు

Posted On: 15 OCT 2023 11:19AM by PIB Hyderabad

పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఏపిఆర్జి) ప్రత్యేక ప్రచారం 3.0 క్రింద 2వ వారంలో కూడా ఉత్సాహంగా అంతా పాల్గొన్నారు.  అక్టోబర్ 9 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ వారం  డిఏపిఆర్జిలో కార్యాలయ స్థలాలను పరిశుభ్రమైన, డిజిటల్ వాతావరణంగా మార్చడంపై దృష్టి సారించింది. ఈ వారంలో,  డిఏపిఆర్జి ...  230 ప్రజా ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించింది. రికార్డ్ నిర్వహణ  పద్ధతుల్లో కూడా గణనీయమైన పురోగతి కనిపించింది-

 

ఏ) భౌతికంగా 1863 ఫైళ్ల సమీక్ష జరిగింది 

బి) 305 ఫైళ్లను తొలగించారు 

సి) 3253 ఈ-ఫైళ్ల సమీక్ష 

డి) 1317 ఈ-ఫైళ్లు మూసివేత 

ఈ వారం ప్రత్యేక ప్రచారం 3.0 వ్యర్థం నుండి సంపదకు సంబంధించిన ప్రధాన మంత్రి దార్శనికతను ప్రతిబింబించేలా నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఈ-స్క్రాప్ ని విక్రయించింది. రూ.38,510 ఆదాయాన్ని, 150 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని ఆర్జించింది. ఈ వారం సోషల్ మీడియాలో కూడా బాగానే కార్యక్రమాలు నిర్వహించారు.   డిఏపిఆర్జి హ్యాండిల్ నుండి జారీ  ట్వీట్లు (సుమారు 400) చేశారు. అలాగే తొమ్మిది పిఐబి ప్రకటనలను విడుదల చేశారు. ప్రత్యేక ప్రచారం 3.0 రోజువారీ పురోగతిని  డిఏపిఆర్జి  లోని ఒక ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతిరోజూ ఎస్సిడిపిఎం పోర్టల్‌లో అప్‌లోడ్ అవుతోంది. 

                                ***



(Release ID: 1967879) Visitor Counter : 67