ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్ర నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రజలకు ప్ర‌ధానమంత్రి శుభాకాంక్షలు


సర్వజన సంక్షేమం ఆకాంక్షిస్తూ దుర్గామాతకు ప్రార్థన

Posted On: 15 OCT 2023 8:44AM by PIB Hyderabad

   విత్ర నవరాత్రి వేడుకలు ప్రారంభం సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పర్వదినం నేపథ్యంలో ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో సంతోషం, శ్రేయ‌స్సు, అదృష్టంతోపాటు చక్కని ఆరోగ్యాన్నివ్వాలని దుర్గామాతను ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలు మొదలైన సందర్భంగా ప్రజలందరి సంక్షేమం ఆకాంక్షిస్తూ ఆ శైలపుత్రి పాదాలకు శ్రీ మోదీ నమస్కరించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా వివిధ భాషల్లో పంపిన వరుస సందేశాల్లో:

“దేశప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు… శక్తి ప్రదాయని అయిన ఆ దుర్గామాత ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టంతోపాటు చక్కని ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. జై దుర్గామాత!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1967859)