ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ లోనిపార్వతీ కుండ్ లో జరిగిన పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
12 OCT 2023 11:52AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని పిథౌరాగఢ్ లో గల పార్వతీ కుండ్ లో దైవ దర్శనం చేసుకోవడం తో పాటు పూజ కార్యక్రమం లో కూడా పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో ఒక సందేశాన్ని పోస్టు చేస్తూ, ఆది కైలాస్ యొక్క దర్శనాన్ని చేసుకోగలిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరి కి వారి సంక్షేమం కోసం మరియు వారికి సంతోషదాయకమైనటువంటి జీవనం దక్కడం కోసం ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో ఒక సందేశాన్ని పోస్టు చేస్తూ, అందులో -
‘‘ఉత్తరాఖండ్ లో పిథౌరాగఢ్ లోని పవిత్ర పార్వతీ కుండ్ లో జరిగిన దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల తో తరించాను. ఇక్కడ నుండి లభించినటువంటి ఆది కైలాస్ దర్శనం ద్వారా నా మనస్సు ఆహ్లాదభరితం అయింది. ప్రకృతి ఒడి లో నెలకొన్న అధ్యాత్మ మరియు సంస్కృతి ల నిలయం అయినటువంటి ఈ ప్రదేశం లో నా దేశాని కి చెందిన కుటుంబ సభ్యులు అందరికి సుఖమయ జీవనం లభించాలి అని అభిలషించాను.’’ అని వ్రాశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టు ను పెడుతూ, అందులో -
‘‘పార్వతీ కుండ్ తాలూకు కొన్ని దృశ్యాలు ఇదుగో. అక్కడ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi ప్రార్థన జరపడం తో పాటు గా పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.’’ అంటూ తెలియజేసింది.
(Release ID: 1967078)
Visitor Counter : 88
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam