ప్రధాన మంత్రి కార్యాలయం
వల్లలార్ గా కూడాప్రసిద్ధుడు అయిన శ్రీ రామలింగ స్వామి యొక్క 200 వ జయంతి సందర్భం గా ప్రసంగించిన ప్రధాన మంత్రి
‘‘వల్లలార్ యొక్కప్రభావం ప్రపంచవ్యాప్తం గా ఉండింది’’
‘‘వల్లలార్ ను మనం స్మరించుకొంటున్నామంటే, మనం ఆయన యొక్క సంరక్షణ మరియు దయ ల భావన లను గుర్తు కు తెచ్చుకొంటున్నామన్న మాటే’’
‘‘ఆకలిగొన్న వారికిఆహారాన్ని అందించడం, దయ తాలూకు కార్యాలు అన్నింటి లోకి అత్యంత గొప్పది అని వల్లలార్ నమ్మే వారు’’
‘‘సామాజిక సంస్కరణలవిషయాని కి వస్తే వల్లలార్ ఆయన జీవించిన కాలాని కంటే ఎంతో ముందుండే వారు’’
‘‘సమ సమాజం కోసంపాటుపడాలి అనేదే వల్లలార్ యొక్క ప్రబోధాల లక్ష్యం గా ఉండేది’’
‘‘కాలానికిస్థానానికి అతీతం గా భారతదేశం లోసాంస్కృతిక జ్ఞానం లో ఉన్న వివిధత్వం అనేది మహానుభావులైన సాధువులు అందించిన ప్రబోధాల తాలూకు ఒక ఉమ్మడి పాశం తోపెనవేసుకొని ఉంది; అది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ యొక్క సామూహిక ఆలోచన కు బలాన్ని ఇస్తోంది’’
Posted On:
05 OCT 2023 1:48PM by PIB Hyderabad
వల్లలార్ అనే పేరు తో కూడా ప్రజలు పిలచుకొన్న శ్రీ రామలింగ స్వామి యొక్క 200 వ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ యొక్క కార్యక్రమాన్ని వల్లలార్ కు సన్నిహిత అనుబంధం ఉన్నటువంటి వడలూరు లో నిర్వహిస్తూ ఉండడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. వల్లలార్ 19 వ శతాబ్దం లో ఈ భూమి మీద నడయాడిన భారతదేశం లో అమిత ఆదరణ పాత్రులైన సాధువుల లో ఒకరుగా ఉండే వారు, మరి ఆయన యొక్క ఆధ్యాత్మిక అంతర్ దృష్టి ఈనాటి కి కూడా ను లక్షల కొద్దీ వ్యక్తుల కు ప్రేరణ ను అందిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘వల్లలార్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన యొక్క ఆలోచనల ను మరియు భావాల ను ఆధారం గా చేసుకొని అనేక సంస్థ లు పాటుపడుతున్నాయి అని శ్రీ నరంద్ర మోదీ స్పష్టం చేశారు.
"మనం వల్లలార్ ను స్మరించుకొంటూ ఉన్నామంటే అప్పుడ మనం ఆయన చాటిచెప్పినటువంటి సంరక్షణ, ఇంకా కరుణ ల భావన ను గుర్తు కు తెచ్చుకొంటున్నట్లే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సాటి మానవుల పట్ల దయ ను కలిగి ఉండడం అనేది అన్నింటి కంటే ఎంతో ప్రధానమైన విషయం అని వల్లలార్ నమ్మే వారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆకలి బాధ ను రూపుమాపడమే ఆయన సూచించిన అతి ప్రధానమైన తోడ్పాటు మరియు నిబద్ధత అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. ‘‘ఒక మనిషి ఖాళీ కడుపు తో పరుండడం ఆయన కు అమితమైన వేదన ను మిగిల్చేది. పస్తు ఉన్న వ్యక్తి కి ఆహారాన్ని అందించడం అనేది దయాభరితం అయినటువంటి పవిత్ర కార్యాల లో అత్యంత గొప్పది అని ఆయన విశ్వసించారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ‘‘పంటలు ఎండపోయినప్పుడల్లా నేను కూడా కృశించిపోయే వాడి ని’’ అని చెప్పిన వల్లలార్ మాటల ను ప్రధాన మంత్రి ఉదాహరించారు. ప్రభుత్వం ఆయన ఆదర్శాల కు కట్టుబడి ఉందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టిన కాలం లో పరీక్షాత్మక స్థితుల లో 80 కోట్ల మంది తోటి భారతీయుల కు ఆహార పదార్థాల ను ఉచితం గా అందించడం ద్వారా వారి కి గొప్ప ఉపశమనాన్ని కలిగించిన సంగతి ని గురించి ఆయన ప్రస్తావించారు.
నేర్చుకోవడానికి మరియు చదువుకోవడానికి ఉన్న శక్తి పట్ల వల్లలార్ లో గల విశ్వాసాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఒక గురువు గా ఆయన తన ఇంటి తలుపుల ను ఎల్లవేళలా తెరచి ఉంచారు, ఆయన లెక్కలేనంత మంది కి దారి ని చూపారు అని ప్రధాన మంత్రి అన్నారు. కురళ్ కు లెక్కపెట్టలేనంత మంది ఆదరణ లభించేటట్లు గా చేయడం మరియు ఆధునిక పాఠ్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వడంలో వల్లలార్ చేసిన కృషి ని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా పేర్కొన్నారు. యువజనులు తమిళం లో, సంస్కృతం లో మరియు ఆంగ్లం లో పట్టు ను సంపాదించాలి అని వల్లలార్ కోరుకొన్నారు అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం లో విద్య కు సంబంధించిన మౌలిక స్వరూపం లో పరివర్తన ను తీసుకొని రావడం కోసం ప్రభుత్వం చేసిన ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. మూడు సుదీర్ఘమైన దశాబ్దాల అనంతరం భారతదేశం అమలు లోకి తెచ్చుకొన్న జాతీయ విద్య విధానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ విధానం నూతన ఆవిష్కరణల పై, పరిశోధనల పై మరియు అభివృద్ధి పై దృష్టి ని కేంద్రీకరిస్తూనే యావత్తు విద్య రంగానికి సంబంధించిన స్వరూపం లో మార్పుచేర్పుల ను తీసుకు వస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాల లో రికార్డు సంఖ్య లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలల ను గురించి ఆయన చెప్తూ, యువతీ యువకులు ప్రస్తుతం వారి వారి స్థానిక భాషల లో చదువుకొంటూ వైద్యులు గాను, ఇంజినీర్ లుగాను ఎదగవచ్చును అని వివరించారు. ఈ పరిణామం యువత కు అనేక అవకాశాల ను ప్రసాదిస్తుంది అని ఆయన అన్నారు.
‘‘సామాజిక సంస్కరణ ల విషయాని కి వస్తే వల్లలార్ తాను జీవించిన కాలం కంటే ఎంతో ముందున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దైవం పట్ల వల్లలార్ కు ఉన్న దృష్టికోణం మతం, కులం మరియు వర్గం అనే అడ్డంకుల కు అతీతం గా వ్యాపించింది అని ఆయన అన్నారు. బ్రహ్మాండం లోని ప్రతి ఒక్క అణువు లోను దివ్యత్వాన్ని వల్లలార్ చూశారు. ఈ దైవీయ సంబంధాన్ని గుర్తించి, మనస్సు లో పదిల పరచుకోవలసింది గా మానవ జాతి కి ఆయన విజ్ఞప్తి చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఒక సమ సమాజం ఏర్పాటే లక్ష్యం గా వల్లలార్ ప్రబోధాలు ఉన్నాయి అని, అటువంటి మహానుభావుని కి శ్రద్ధాంజలి ని ఘటించే వేళ లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్’ పట్ల తనకు ఉన్ననమ్మకం మరింత బలపడుతుంది అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. మహిళ లకు చట్ట సభల లో సీట్ లను ప్రత్యేకిస్తున్నటువంటి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ఆమోదాన్ని పొందాలి అనేటటువంటి ఆశీర్వాదాన్ని వల్లలార్ ఇచ్చి ఉండి ఉంటారన్న నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. వల్లలార్ రచనల లోని సీదాసాదా తనాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, అవి చదవడాని కి వాటిలోని మర్మాన్ని గ్రహించడాని కి సులభం గా ఉన్నాయని; అంతేకాక జటిఅం అయినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరళమైన మాటల లో తెలియ జేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం యొక్క సాంస్కృతిక జ్ఞానం లో కాలాని కి స్థానాని కి తగినట్లుగా ఉండే వివిధత్వం మహనీయులైన సాధువులు అందించిన ప్రబోధాల సామాన్య సూత్రం తో ముడిపడి ఉంది అని, అది ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ తాలూకు సామూహిక ఆలోచన లు బలాన్ని ఇస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ శుభ సందర్భం లో, వల్లలార్ యొక్క ఆదర్శాల ను నెరవేర్చడం కోసం తాను కంకణం కట్టుకొన్నట్లు ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. వల్లలార్ అందించిన ప్రేమ, దయ మరియు న్యాయం తాలూకు సందేశాన్ని వ్యాప్తి చేయాలంటూ ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ‘‘ఆయన హృదయాని కి దగ్గర గా ఉండినటువంటి రంగాల లో మనం అందరం కష్టించి పని చేయడాన్ని కొనసాగించెదము గాక. మన పరిసర ప్రాంతాల లో ఏ ఒక్క వ్యక్తి కూడ ఆకలి తో బాధపడకుండా జాగ్రత తీసుకొందాం, రండి. ప్రతి ఒక్క చిన్నారి నాణ్యమైన విద్య ను అందుకొనేటట్లుగా పూచీపడదాం రండి’’ అన్నారు.
*****
DS/TS
(Release ID: 1964749)
Visitor Counter : 136
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam