ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడోత్సవాల్లో వరుసగా రెండో సారి జావెలిన్ ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు పిఎం అభినందనలు

प्रविष्टि तिथि: 04 OCT 2023 7:26PM by PIB Hyderabad

హాంగ్ ఝూలో జరుగుతున్న 2022 ఆసియా  క్రీడోత్సవాల్లో వరుసగా రెండో సారి స్వర్ణ పతకం  సాధించినందుకు నీరజ్  చోప్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘ఆసియా క్రీడోత్సవాల్లో జావెలిన్  త్రోలో నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి స్వర్ణ  పతకం  సాధించాడు. ఈ చారిత్రక విజయానికి అతనికి అభినందనలు. ఎన్నో  సంవత్సరాల శిక్షణ, అంకిత భావం అతనికి ఈ అద్భుత విజయం సాధించి పెట్టాయి. అతను విజయాల్లో కొత్త శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను. అతనికి అభినందనలు’’

అని పేర్కొన్నారు.  


(रिलीज़ आईडी: 1964738) आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam