ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల పురుషుల 800 మీటర్ల పరుగులో రజతం సాధించిన మహమ్మద్ అఫ్జల్ పులిక్కలకత్ను అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 03 OCT 2023 9:59PM by PIB Hyderabad

   సియా క్రీడల పురుషుల 800 మీటర్ల పరుగులో ర‌జత ప‌త‌కం కైవసం చేసుకున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడు మ‌హ్మ‌ద్ అఫ్జల్‌ పులిక్క‌ల‌క‌త్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల పురుషుల 800 మీటర్ల పరుగులో రజత పతక విజేత మహ్మద్ అఫ్జల్‌ పులిక్కలకత్‌కు నా అభినందనలు. అతని కృషి, పట్టుదల ఫలించాయి. అతడు సాధించిన ఈ విజయంపై భారత్‌ హర్షం ప్రకటిస్తోంది. శభాష్‌!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/RT



(Release ID: 1963935) Visitor Counter : 87