ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

25 ఎం విమెన్స్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్ లో చారిత్రక రజత పతకం సాధించినందుకు ఈషా సింగ్ కు పిఎం అభినందనలు

प्रविष्टि तिथि: 27 SEP 2023 8:46PM by PIB Hyderabad

ఆసియా క్రీడోత్సవాల్లో 25 ఎం విమెన్స్  పిస్టల్  షూటింగ్  ఈవెంట్  లో రజత పతకం సాధించినందుకు ఈషా సింగ్  కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘ఈషా సింగ్  అద్భుత రజతం.

ఆసియా క్రీడల్లో 25 ఎం విమెన్స్  పిస్టల్ షూటింగ్ ఈవెంట్  లో ఈషా సింగ్  రజతపతకం సాధించడం గర్వకారణం. ఆమె అద్భుత ప్రతిభ, కఠిన శ్రమ, అంకిత భావం మనని గర్వపడేలా చేశాయి.

భవిష్యత్  ఈవెంట్లలో కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించాలని అభినందనలు’’. అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1963597) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Malayalam , Assamese , Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada