ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టుకు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
28 SEP 2023 11:05AM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు షూటర్లు, సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ తమ కచ్చితత్వం, నైపుణ్యంతో యావద్దేశం గర్వించేలా చేశారని శ్రీ మోదీ అన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 10 నదాన మన పురుషుల జట్టు అద్భుత ప్రదర్శనతో మరో స్వర్ణం తెచ్చింది! సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ తమ కచ్చితత్వం, నైపుణ్యంతో దేశం మొత్తం గర్వించేలా చేశారు. ఈ విజయానికిగాను వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1962112)
आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam