ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నివాళి

प्रविष्टि तिथि: 28 SEP 2023 9:39AM by PIB Hyderabad

ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“లతా దీదీ జయంతి నేపథ్యంలో ఆమెకు నా నివాళి. భారతీయ సంగీతానికి ఆమె దశాబ్దాలపాటు చేసిన సేవ అజరామర ప్రభావాన్ని సృష్టించింది. ఆమె ఆలపించిన మనోహర గీతాలు లోతైన భావోద్వేగాలను తట్టిలేపుతాయి. మన సంగీత సంస్కృతిలో వాటికి సదా ప్రత్యేక స్థానం ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1962107) आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam