ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్య సభ లో రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 ను సమర్థించవలసింది గా సభ్యులందరికి, పార్టీల కు మరియు వాటి నేతల కు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి


‘‘ఈ చర్చ లో ఆడిన ప్రతి మాట మన భావి పార్లమెంటరీ యాత్ర లో మనందరి కి ఉపయోగకరం గా ఉంటుంది’’

‘‘ఈ చర్చ లో పాలుపంచుకొన్నరాజకీయ పక్షాలు అన్నిటి యొక్క ఉత్సాహం దేశ ప్రజల లో ఒక క్రొత్త ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతుంది’’

Posted On: 21 SEP 2023 10:49PM by PIB Hyderabad

రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 ను గురించి రాజ్య సభ లో జరిగిన చర్చ ఆఖరు లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భం లో ఆయన, గత రెండు రోజులు గా పార్లమెంటు ఉభయ సభల లో జరిగిన చర్చలు మరియు వాదోపవాదాలు అర్థవంతమైనవి గా ఉన్నాయన్నారు. ఈ చర్చల లో సుమారు గా 132 మంది గౌరవనీయ సభ్యులు వారి వారి అభిప్రాయాల ను వెల్లడించారు. ‘‘ఈ చర్చ లో ఆడిన ప్రతి మాట కు తనదైన ప్రాముఖ్యం మరియు అర్థం ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ అర్థవంతమైనటువంటి చర్చ లు దేశం యొక్క భావి పార్లమెంటరీ యాత్ర కు ఎంతో ఉపయోగకరం గా నిలుస్తాయి అని ఆయన నొక్కి చెప్పారు.

 

ఈ బిల్లు ను సమర్ధించిన సభా సభ్యుల కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలిపారు. ‘‘ఈ యొక్క ఉత్సాహం దేశ ప్రజల లో ఒక క్రొత్త ఆత్మవిశ్వాసాన్ని జనింప చేస్తుంది. మరి సభ్యులు అందరు, అలాగే అన్ని రాజకీయ పక్షాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ను పోషించాయి.’’ అని ఆయన అన్నారు. ఈ బిల్లు కు ఆమోదం లభించడం తో మహిళా శక్తి కి ప్రత్యేకమైన ఆదరణ లభిస్తున్నట్లు కాదు కానీ ఈ బిల్లు పట్ల రాజకీయ పక్షాలన్నిటి సకారాత్మకమైన ఆలోచన తో మన దేశం లోని నారీ శక్తి లో ఒక సరిక్రొత్త ఉత్తేజం ప్రవహిస్తోందని ఆయన అన్నారు. ఈ బిల్లు భారతదేశం యొక్క ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు కు భరోసా ను కల్పిస్తుంది. ఎందుకు అంటే ఈ బిల్లు నాయకత్వం తో ముందడుగు ను వేయడం తో పాటు గా సరిక్రొత్త విశ్వాసం తో దేశ నిర్మాణ దిశ లో తోడ్పాటు ను అందిస్తుంది అని కూడా ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, చర్చ ఆసాంతం వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల కు గాను కృతజ్ఞత ను తెలిపారు. ఎగువ సభ ఏకగ్రీవం గా సమర్థిస్తూ వోటు వేసి బిల్లు ను ఆమోదించవలసింది అంటూ ఆయన విజ్ఞప్తి ని చేశారు.

 

***


(Release ID: 1959616) Visitor Counter : 157