సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ముఖ్యాంశాలు, మార్గదర్శకాలు

Posted On: 20 SEP 2023 5:42PM by PIB Hyderabad

         కేంద్ర ప్రభుత్వ రంగ పథకం పిఎం విశ్వకర్మను 17 సెప్టెంబర్, 2023న ప్రధానమంత్రి స్వహస్తాలతో ప్రారంభించారు.  
పనిముట్లతో పనిచేసే చేతివృత్తుల వారికి, హస్త కళాకారులకు ఆది నుంచి అంతం వరకు అన్ని రకాల మద్దతు అందించడానికి
ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఈ కింద పేర్కొన్న 18 వ్యాపారాలు/వృత్తులలో  నిమగ్నమైన  చేతివృత్తులవారికి, కళాకారులకు వర్తిస్తుంది  అవి.(i) వడ్రంగి (సుతార్/బదాయి); (ii) పడవల తయారీదారులు ; (iii) కవచం తయారీ ; (iv) కంసాలి (లోహార్); (v) సుత్తి, పనిముట్ల తయారీ;  (vi) తాళాలు వేసేవారు ; (vii) స్వర్ణకారులు (సోనార్); (viii) కుమ్మరి (కుమ్హర్); (ix) శిల్పి (విగ్రహాల తయారీ), రాళ్లు కొట్టేవారు ; (x) చెప్పులు కుట్టేవారు (చర్మకారులు/ షూస్మిత్/పాదరక్షల కళాకారుడు; (xi) తాపీ పనివారు ; (xii) బుట్టలు/చాప/చీపుర్ల తయారీ /పీచు అల్లేవారు ; (xiii) బొమ్మల తయారీ  (సాంప్రదాయ); (xiv) మంగలి (నాయీ బ్రాహ్మణ) ; (xv) పూల మాలలు అల్లేవారు ; (xvi) చాకలి (ధోబీ) ; (xvii) టైలర్ (దర్జి); మరియు (xviii) చేపల వలలు తయారుచేసేవారు.

చేతివృత్తులవారికి     మరియు హస్తకళాకారులకు ఈ క్రింది ప్రయోజనాలను అందించడం ఈ పథకం యోచన.

(i) గుర్తింపు: PM విశ్వకర్మ ధృవీకరణ పత్రం (సర్టిఫికెట్) మరియు గుర్తింపు కార్డు ద్వారా చేతివృత్తులవారు మరియు కళాకారుల గుర్తింపు.

(ii) నైపుణ్య స్థాయి పెంపు : 5-7 రోజుల ప్రాథమిక శిక్షణ మరియు 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ అధునాతన శిక్షణ. శిక్షణ కాలంలో రోజుకు రూ.  500 ఉపకారవేతనం.

(iii) పనిముట్లు  ప్రోత్సాహకం:  మౌలిక నైపుణ్య శిక్షణ ప్రారంభంలో పనిముట్ల కోసం ఇ-వోచర్ల రూపంలో రూ. 15,000 వరకు టూల్‌కిట్ ప్రోత్సాహకం
ఆనుషంగిక


(iv) పరపతి తోడ్పాటు/మద్దతు: రెండు విడతలలో  అనుషంగిక సంబంధం లేని  మూడు లక్షల రూపాయల 'వ్యవస్థాపక/వ్యాపార అభివృద్ధి రుణం'.  మొదట రూ. 1 లక్ష రెండవ విడత రూ. 2 లక్షలు వరుసగా 18 నెలలు మరియు 30 నెలల కాలవ్యవధితో 5% స్థిర రాయితీ వడ్డీ రేటుతో ,  8% భారత ప్రభుత్వ రాయితీతో ఇవ్వడం జరుగుతుంది.    ప్రాథమిక శిక్షణ పూర్తిచేసిన లబ్ధిదారులు లక్ష రూపాయల మొదటి విడత రుణ మద్దతు పొందేందుకు అర్హులు.   లక్ష రూపాయల మొదటి విడత రుణం పొంది, ప్రామాణిక రుణ ఖాతాను కలిగి ఉండి,  తమ వ్యాపారంలో డిజిటల్ లావాదేవీలను అవలంభిస్తున్న లేదా అధునాతన శిక్షణ పొందిన లబ్ధిదారులకు రెండవ విడత రుణం లభిస్తుంది.

(v) డిజిటల్ లావాదేవీలకు  ప్రోత్సాహకం:  ప్రతి డిజిటల్ లావాదేవీకి ఒక రూపాయి చొప్పున గరిష్టంగా నెలకు 100 లావాదేవీల వరకు నెలవారీగా ప్రతి డిజిటల్ చెల్లింపు లేదా రసీదుకు ప్రతిగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

(vi) మార్కెటింగ్ మద్దతు: చేతివృత్తులవారు మరియు కళాకారులకు మూల్య శృంఖలతో అనుసంధానాన్ని మెరుగుపరచడానికి నాణ్యతా ధృవీకరణ, బ్రాండింగ్, జీఇఎమ్  వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌బోర్డింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ మరియు ఇతర మార్కెటింగ్ కార్యకలాపాల రూపంలో మార్కెటింగ్ మద్దతు అందించడం జరుగుతుంది.

            పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు, స్కీమ్ అధికారిక MSME పర్యావరణ వ్యవస్థలో 'వ్యవస్థాపకులు'గా  ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్‌లోని లబ్ధిదారులను ఆన్‌బోర్డ్ చేస్తుంది.

PM విశ్వకర్మ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రమాణీకరణతో సాధారణ సేవల కేంద్రాల ద్వారా లబ్ధిదారులను నమోదు చేయడం జరుగుతుంది. లబ్ధిదారుల నమోదు తర్వాత మూడు-దశల ధృవీకరణ ఉంటుంది, ఇందులో (i) గ్రామ పంచాయతీ/ పట్టణ స్థానిక సంస్థల (ULB) స్థాయిలో ధృవీకరణ, (ii) జిల్లా అమలు కమిటీ తనిఖీ / పరిశీలన మరియు  సిఫార్సు (iii) స్క్రీనింగ్ (పరీక్ష/వడపోత) కమిటీ ఆమోదం.

మరింత సమాచారం కోసం, PM విశ్వకర్మ మార్గదర్శకాలు  pmvishwakarma.gov.inను సందర్శించి తెలుసుకోవచ్చు. చేతివృత్తుల వారు  మరియు హస్త కళాకారులు  ఏవైనా సందేహాలుంటే వాటి నివృత్తి కోసం 18002677777కు కాల్ చేయవచ్చు లేదా pm-vishwakarma@dcmsme.gov.inకి ఈమెయిల్ చేయవచ్చు.


 

****



(Release ID: 1959609) Visitor Counter : 1237