ప్రధాన మంత్రి కార్యాలయం

లోక్ సభ లో రాజ్యాంగ(నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 కు సమర్థన ను తెలిపినందుకు  మరియుఅర్థవంతమైన చర్చ కు గాను సభ్యులు అందరికి, పార్టీల కు మరియు వాటి నేతల కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి


‘‘ఇది దేశం యొక్కపార్లమెంటరీ ప్రస్థానం లో ఒక బంగారు క్షణం గా ఉన్నది’’

‘‘ఇది మాతృశక్తియొక్క మన:స్థితిని మార్చివేయగలదు, అంతేకాకుండా ఇది దేశాన్ని క్రొత్తశిఖరాల కు తీసుకు పోవడం కోసం ఒక అనూహ్య శక్తి ని సృష్టించగలదు’’

Posted On: 21 SEP 2023 12:01PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి మరియు సభ యొక్క నేత శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లోక్ సభ లో రాజ్యాంగ (నూట ఇరవై ఎనిమిదో సవరణ) బిల్లు, 2023 కు సంబంధించి అన్ని రాజకీయ పక్షాల సమర్థన కు, అర్థవంతమైన చర్చ కు గాను ధన్యవాదాల ను తెలియజేశారు. ఈ బిల్లు క్రొత్త పార్లమెంటు భవనం లో సభ కార్యకలాపాలలో మొదటి అంశం గా ఉండింది. ఈ బిల్లు పైన నిన్నటి రోజు న లోక్ సభ లో చర్చ జరిగి, దీనిని ఆమోదించడం జరిగింది.

ఈ రోజు న సభా కార్యకలాపాలు మొదలవగానే ప్రధాన మంత్రి తన స్థానం లో నుండి లేచి నిలబడి మరి నిన్నటి రోజు న భారతదేశం యొక్క పార్లమెంటరీ ప్రస్థానం లో చోటు చేసుకొన్నటువంటి ఒక బంగారు క్షణం గురించి ప్రస్తావించారు. ఈ కార్యసాధన కు గాను ఖ్యాతి అన్ని పక్షాల కు చెందిన సభ్యుల దీ, వారి నేతలదీనూ అని ఆయన అన్నారు. నిన్న తీసుకొన్న నిర్ణయం మరియు రాజ్య సభ లో దీని తాలూకు పరిణతి మాతృశక్తి యొక్క మన:స్థితి ని మార్చివేస్తుందని, అంతేకాక దీనితో అంకురించేటటువంటి ఆత్మవిశ్వాసం దేశాన్ని క్రొత్త శిఖరాల కు చేర్చడానికి ఒక అనూహ్యమైన శక్తి వలె ఉనికి లోకి వస్తుందని ఆయన అన్నారు. ‘‘ఈ పవిత్రమైనటువంటి బాధ్యత ను పూర్తి చేసినందుకు నేను సభ నేత గా మీ యొక్క తోడ్పాటు కు, మీ యొక్క సమర్థన కు మరియు మీ యొక్క అర్థవంతమైన చర్చకు గాను నా మనస్సు లో లోపలి నుండి దీనిని స్వీకరించి నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని చెప్తూ, ప్రధాన మంత్రి తన మాటల ను ముగించారు.

 

***

DS



(Release ID: 1959368) Visitor Counter : 141