ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ రచయిత్రి.. ఒడిషా ముఖ్యమంత్రి సోదరి శ్రీమతి గీతా మెహతా మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 17 SEP 2023 9:24AM by PIB Hyderabad

   ప్రముఖ రచయిత్రి, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ సోదరి శ్రీమతి గీతా మెహతా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రముఖ రచయిత్రి శ్రీమతి గీతా మెహతా మృతి నన్నెంతో బాధించింది. ఆమె బహుముఖ వ్యక్తిత్వం, మేధాసంపత్తి, రచన-సినిమా నిర్మాణంపై అభిరుచి జగద్విదితం. ఆమె ప్రకృతి పరిరక్షణ, జల సంరక్షణపైనా ఆమె ఎంతో శ్రద్ధ చూపేవారు. ఈ విషాద సమయంలో @నవీన్_ఒడిషా గారు, వారి కుటుంబానికి ఆ దైవం మనోస్థైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST(Release ID: 1958362) Visitor Counter : 111