మంత్రిమండలి

న్యూ ఢిల్లీ జి-20 శిఖర సమ్మేళనం సఫలం కావడం పై తీర్మానానికి మంత్రిమండలి ఆమోదం

Posted On: 13 SEP 2023 8:53PM by PIB Hyderabad

కేంద్ర మంత్రిమండలి ఈ రోజు న జరిగిన సమావేశం లో 2023 సెప్టెంబర్ తొమ్మిదో, పదో తేదీల లో న్యూ ఢిల్ లో జరిగిన జి-20 శిఖర సమ్మేళనం యొక్క సాఫల్యాన్ని ప్రశంసిస్తూ, ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

 

ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుఇతివృత్తం తాలూకు వివిధ అంశాల ను ఖరారు చేయడం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దార్శనికత ను మంత్రిమండలి కొనియాడింది. ప్రధాన మంత్రి సూచిస్తున్న ప్రజల భాగస్వామ్యం సంబంధి దృష్టికోణం జి-20 సంబంధి కార్యక్రమాల లో, కార్యకలాపాల లో మన సమాజం లోని అనేక వర్గాల ను భాగం పంచుకొనేటట్లుగా చేసింది. 60 నగరాల లో జరిగిన 200 కు పైగా సమావేశాలు జి-20 సంబంధి కార్యక్రమాల విషయం లో ప్రజల లో ఇది వరకు ఎన్నడూ లేని విధం గా భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. దీనికి పర్యవసానం గా, జి-20 కి భారతదేశం అధ్యక్షత ను వహించడం సిసలైన అర్థం లో ప్రజలే కేంద్ర స్థానం లో నిలచేది గాను మరియు ఒక జాతీయ ప్రయాస వలెను తెర మీద కు వచ్చింది.

 

ఈ శిఖర సమ్మేళనం తాలూకు ఫలితాలు పరివర్తనాత్మకం గా ఉన్నాయని, మరి రాబోయే దశాబ్దాల లో ప్రపంచ వ్యవస్థ కు క్రొత్త రూపు రేఖ లు ఇవ్వడం లో వాటి వంతు తోడ్పాటు ను ఇస్తాయని మంత్రిమండలి అభిప్రాయపడింది. వీటన్నింటిలోను స్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టేనబల్ డెవలప్ మెంట్ గోల్స్.. ఎస్ డిజిస్) ను సాధించడం లో, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల లో సంస్కరణల కు బాట ను పరచడం లో, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం లో, గ్రీన్ డెవలప్ మెంట్ పాక్ట్ కు ప్రోత్సాహాన్ని అందించడం లో మరియు మహిళ లు నాయకత్వం వహించే అభివృద్ధి సాధన ను ప్రోత్సహించడం లో ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరిగింది.

 

ప్రపంచం లో తూర్పు- పశ్చిమ ప్రాంతాల మధ్య భేదం బలం గా ఉందని, మరి నార్థ్- సౌథ్ ల మధ్య విభజన గాఢమైందని, ఇటువంటి తరుణం లో ప్రధాన మంత్రి యొక్క ప్రయాస లు ప్రస్తుత కాలం లోని అత్యంత ఆవశ్యకమైన అంశాల విషయం లో ఒక మహత్వపూర్ణమైనటువంటి ఏకాభిప్రాయాన్ని సాధించే పని ని చేసి చూపించాయని కూడా మంత్రిమండలి పేర్కొన్నది.

 

వాయస్ ఆఫ్ ది గ్లోబల్ సౌథ్శిఖర సమ్మేళనాన్ని నిర్వహించడం అనేది భారతదేశం యొక్క అధ్యక్షత తాలూకు ఓ విశిష్ట పార్శ్వం గా ఉండింది. వీటన్నిటి మధ్య, ఆఫ్రికన్ యూనియన్ ను జి-20 లో ఒక శాశ్వత సభ్యత్వ దేశం గా స్వీకరించడం అనేది భారతదేశం తీసుకొన్న చొరవ వల్లనే చోటు చేసుకోవడం విశేషించి సంతోషదాయకమైన విషయం గా ఉన్నది.

 

న్యూ ఢిల్లీ సమిట్ భారతదేశం యొక్క సమకాలీన సాంకేతిక విజ్ఞానపరమైన పురోగతి ని చాటిచెప్పిన ఒక సందర్భం కావడం తో పాటు అది మన వారసత్వాన్ని, సంస్కృతి ని మరియు సంప్రదాయాల ను కూడా కళ్ళకు కట్టే సందర్భాన్ని సైతం అందించింది. జి-20 సభ్యత్వ దేశాల కు చెందిన నేత లు మరియు ప్రతినిధులు దీనిని ఎంతగానో ప్రశంసించారు.

 

జి-20 శిఖర సమ్మేళనానికి సంబంధించినటువంటి ప్రముఖ ఘటనక్రమాల ను గురించి చెప్పవలసి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కు జవసత్వాల ను సమకూర్చడం, అభివృద్ధి కై ఇతోధిక వనరుల ను అందుబాటు లోకి తీసుకు రావడం, పర్యటన రంగాన్ని విస్తరించడం, ప్రపంచం లో కార్యస్థలాల లో అవకాశాల ను, ‘శ్రీఅన్నయొక్క ఉత్పాదన మరియు వినియోగం ల ద్వారా బలమైనటువంటి ఆహార సురక్ష, ఇంకా బయో-ఫ్యూయల్స్ విషయం లో ఒక ప్రగాఢమైన నిబద్ధత వంటివి భాగం గా ఉండి, వాటి తో యావత్తు దేశాని కి ప్రయోజనాలు చేకూరనున్నాయి.

 

ఈ శిఖర సమ్మేళనం సాగిన క్రమం లో ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకానామిక్ కారిడర్ అగ్రిమంట్’ మరియు ‘గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్’ లు తుది రూపు ను సంతరించుకోవడం కూడా గొప్ప ఘటన క్రమాలే.

 

జి-20 శిఖర సమ్మేళనం యొక్క సాఫల్యం లో పాలుపంచుకొన్న అన్ని సంస్థల తో పాటు వ్యక్తుల యొక్క తోడ్పాటు ను కూడాను కేంద్ర మంత్రిమండలి ప్రశంసించింది. భారతదేశం లో ప్రజలు, ప్రత్యేకించి యువ తరం ఈ శిఖర సమ్మేళనం సంబంధి కార్యకలాపాల లో ఎక్కడలేని ఉత్సాహం గా పాలుపంచుకొన్న సంగతి ని కేంద్ర మంత్రిమండలి గుర్తించింది. ప్రపంచం లో వృద్ధి కి మరియు అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యం తో జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించే ప్రక్రియ కు ఒక బలమైన దిశ ను ఇవ్వడం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క నేతృత్వాన్ని మంత్రిమండలి ప్రశంసించింది.

 

***

 

 



(Release ID: 1957279) Visitor Counter : 179