ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

మెసర్స్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో రూ.9589 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Posted On: 13 SEP 2023 3:23PM by PIB Hyderabad

మెసర్స్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో రూ.9589 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అందిన  ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన  ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలిపింది. సైప్రస్ కు చెందిన మెసర్స్  బెర్హ్యాండా లిమిటెడ్ ఈ పెట్టుబడి పెడుతుంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన తీర్మానం ప్రకారం మెసర్స్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ లో  76.1% వరకు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి మెసర్స్  బెర్హ్యాండా లిమిటెడ్ ఆమోదం పొందింది,  మెసర్స్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్   నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్‌లో జాబితా చేయబడిన ఒక పబ్లిక్ లిమిటెడ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. మెసర్స్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తో కుదిరిన ఒప్పందం మేరకు  తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ద్వారా ఇప్పటికే ఉన్న ప్రమోటర్ షేర్‌హోల్డర్‌లు, పబ్లిక్ షేర్ హోల్డర్ల వాటాలు  మెసర్స్ బెర్హ్యాండా లిమిటెడ్ కు బదిలీ అవుతాయి.ఒప్పందం వల్ల మెసర్స్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో మొత్తం విదేశీ పెట్టుబడులు 90.1% వరకు పెరగవచ్చు.

ఈ ప్రతిపాదనను సెబీ, రిజర్వు బ్యాంకు, సీసీఐ, ఇతర సంబంధిత సంస్థలు పరిశీలించాయి.  సంబంధిత శాఖలు,  సెబీ, రిజర్వు బ్యాంకు ద్వారా అందిన  ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత ప్రతిపాదనకు ఆమోదం లభించింది.  అన్ని నియమాలు మరియు నిబంధనలు అమలు జరిగే  ఒప్పందం అమలు జరుగుతుంది. 

విదేశీ పెట్టుబడి సంస్థ అయిన మెస్సర్స్  బెర్హ్యాండా లిమిటెడ్‌లోని మొత్తం పెట్టుబడులు అడ్వెంట్ ఫండ్‌ నిర్వహణలో ఉన్నాయి. వివిధ పరిమిత భాగస్వాముల (LPలు) నుంచి అడ్వెంట్ ఫండ్‌ పెట్టుబడులను సమీకరిస్తుంది.   అడ్వెంట్ ఫండ్స్ కార్యకలాపాలు అమెరికాలో నమోదైన  అడ్వెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్  ద్వారా జరుగుతున్నాయి. 1984లో ఏర్పాటైన అడ్వెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ 42 దేశాల్లో సుమారు USD 75 బిలియన్ల పెట్టుబడులు పెట్టింది. అడ్వెంట్ ఇండియా 2007 నుంచి  భారతదేశంలో పెట్టుబడులను ప్రారంభించింది.  ఇప్పటివరకు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, పారిశ్రామిక తయారీ, వినియోగ వస్తువులు,ఐటీ సేవల రంగాలలో 20 భారతీయ కంపెనీలలో సుమారు రూ. 34000 కోట్లు పెట్టుబడి పెట్టింది.

 కొత్త ఉద్యోగాలు కల్పించడం , ప్లాంట్ ,పరికరాలలో పెట్టుబడుల ద్వారా భారతీయ కంపెనీ సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా ఒప్పందం కుదిరింది. . అడ్వెంట్ గ్రూప్‌తో అనుబంధం వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం ద్వారా మెస్సర్స్  సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌ కార్యకలాపాల పరిధి పెరుగుతుందని భావిస్తున్నారు.  కార్యాచరణ నైపుణ్యాన్ని సాధించడం; ఉత్పాదకతను పెంచడం,వృద్ధిని వేగవంతం చేయడం,  ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ  పర్యావరణ, ఆరోగ్యం మరియు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కార్యకలాపాలను నిర్వహించడం,  ఇప్పటికే ఉన్న నిపుణులకు  శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలను అమలు చేస్తారు. 

వేగవంతమైన ఆర్థిక వృద్ధి,అభివృద్ధికి సాంకేతిక, ఆవిష్కరణలు, నైపుణ్యం ద్వారా ప్రపంచంలో అమలు జరుగుతున్న అత్యుతమ విధానాలు  ఔషధ రంగానికి అందుబాటులోకి తీసుకువచ్చి  పెట్టుబడిదారులకు అనుకూలమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. ఉత్పాదకతను పెంపొందించడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి ఇతర ప్రయోజనాలతో పాటు ఉపాధి కల్పనకు అనుబంధ మూలధనం సేకరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విధానం రూపొందింది. .

ప్రస్తుతం అమలులో ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం ప్రకారం గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్ ప్రాజెక్ట్‌లలో ఆటోమేటిక్ రూట్‌లో 100% విదేశీ పెట్టుబడులు అనుమతించబడతాయి. బ్రౌన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్ ప్రాజెక్ట్‌లలో ఆటోమేటిక్ రూట్‌లో 74% వరకు ఎఫ్‌డిఐ అనుమతించబడుతుంది. 74% మించి పెట్టుబడికి ప్రభుత్వ అనుమతి అవసరం. గత ఐదేళ్లలో (2018-19 నుంచి 2022-23 వరకు) ఔషధ రంగంలో మొత్తం ఎఫ్‌డిఐ  రూ.43,713 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఎఫ్‌డిఐలో 58% గణనీయమైన వృద్ధిని సాధించింది.

 

***


(Release ID: 1957031) Visitor Counter : 128